MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Health
  • Earbuds : వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ వాడుతున్నారా? అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వార్నింగ్ మీకే

Earbuds : వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ వాడుతున్నారా? అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వార్నింగ్ మీకే

వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ తక్కువ స్థాయిలో రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. అయినా వీటివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేవు అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (wHO).

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 24 2026, 08:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇయర్ బడ్స్ ఇంత ప్రమాదకరమా?
Image Credit : Chat GPT

ఇయర్ బడ్స్ ఇంత ప్రమాదకరమా?

ఈ డిజిటల్ యుగంలో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ (Wireless Earbuds or Bluetooth) మన జీవితంలో ఒక భాగమైపోయాయి. ప్రయాణంలో, వ్యాయామం చేసేటప్పుడు, ఆఫీస్ పనిలో.. ఇలా ప్రతీచోట వీటి వాడకం కామన్ అయిపోయింది. అయితే వీటి నుంచి వచ్చే రేడియేషన్ (Radiation) మన మెదడుపై ప్రభావం చూపుతుందా అనే ఆందోళన చాలామందిలో ఉంది. దీనిపై సైన్స్ ఏం చెబుతోందో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇయర్ బడ్స్ రేడియేషన్ విడుదల చేస్తాయా?
Image Credit : chat gpt

ఇయర్ బడ్స్ రేడియేషన్ విడుదల చేస్తాయా?

వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ బ్లూటూత్ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఇవి పనిచేస్తున్నప్పుడు తక్కువ స్థాయిలో రేడియో ఫ్రీక్వెన్సీ (RF) తరంగాలను విడుదల చేస్తాయి. అదే వైర్డ్ (Wired) హెడ్‌ఫోన్‌లు కేబుల్ ద్వారా సిగ్నల్స్ పంపిస్తాయి కాబట్టి వాటి నుంచి ఎలాంటి రేడియేషన్ రాదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇయర్‌బడ్స్ నుంచి వచ్చే రేడియేషన్, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాల కన్నా చాలా తక్కువగా ఉంటుంది.

35
సైన్స్, పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Image Credit : pinterest

సైన్స్, పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్‌ను 'ప్రమాదకారి కావొచ్చు' (Possibly Carcinogenic - Group 2B) కేటగిరీలో చేర్చాయి. అంటే ఇది హానికరం అని నిరూపించడానికి ప్రస్తుతానికి పరిమిత ఆధారాలు మాత్రమే ఉన్నాయని అర్థం. ఎక్కువ కాలం వాడితే వచ్చే ప్రభావాలపై అధ్యయనాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇయర్‌బడ్స్ నేరుగా బ్రెయిన్ క్యాన్సర్‌కు కారణమవుతాయని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు ఇప్పటివరకూ లేవు.

45
ఇంతకూ ఇయర్ బడ్స్ ప్రమాదకరమా, కాదా?
Image Credit : pinterest

ఇంతకూ ఇయర్ బడ్స్ ప్రమాదకరమా, కాదా?

సాధారణ వాడకంలో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను ప్రమాదకరమైనవిగా పరిగణించరు. వీటి నుంచి వెలువడే రేడియేషన్ మన స్మార్ట్‌ఫోన్‌ల కంటే కూడా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ భద్రత కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అవసరం ఉన్నా, లేకపోయినా చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకోవడం మంచిదికాదు.. ఇది ప్రమాదానికి దారితీయవచ్చు. 

55
ఇయర్ బడ్స్ సురక్షితమైన వాడకానికి చిట్కాలు
Image Credit : Flipkart website

ఇయర్ బడ్స్ సురక్షితమైన వాడకానికి చిట్కాలు

విరామం ఇవ్వండి : గంటల తరబడి ఇయర్‌బడ్స్ పెట్టుకోవద్దు. మధ్యమధ్యలో విరామం తీసుకోండి.

వైర్డ్ హెడ్‌ఫోన్‌లు వాడండి : ఇంట్లో లేదా ఆఫీసులో ఎక్కువ సేపు పాటలు వినేటప్పుడు వైర్డ్ హెడ్‌ఫోన్‌లు వాడటం మంచిది.

నిద్రపోయేటప్పుడు వాడొద్దు : ఇయర్‌బడ్స్ పెట్టుకుని నిద్రపోయే అలవాటు మానుకోండి. ఇది చెవి ఆరోగ్యానికి, రేడియేషన్ పరంగా కూడా మంచిది కాదు.

మొత్తంగా చెప్పాలంటే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌పై అనవసరమైన భయం వద్దు, కానీ జాగ్రత్తగా వాడటం ఎప్పుడూ మంచిదే. అవసరం ఉంటేనే వీటిని వాడండి... బ్లూటూత్ ఇయర్ బర్డ్స్ కాకుండా వైర్డ్స్ ఇయర్ ఫోన్స్ వాడటం ఉత్తమం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
Earbuds : ఇయర్‌బర్డ్స్ ఎక్కువగా వాడుతారా? అయితే.. మీకే ఈ వార్నింగ్ !
Recommended image2
Bluetooth vs Wired Earphones.. వీటిలో ఏది బెటర్? డాక్టర్లు ఏం చెబుతున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved