Telugu

Earbuds : ఇయర్‌బర్డ్స్ ఎక్కువగా వాడుతారా? అయితే.. మీకే ఈ వార్నింగ్ !

Telugu

ఇయర్‌బడ్స్ నష్టాలు

ఇటీవల ఓ ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇయర్‌బడ్స్ వల్ల 45% వినికిడి శక్తి కోల్పోయినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇయర్‌బడ్స్ వల్ల నిజంగానే చెవుడు వస్తుందా అనే ప్రశ్న తలెత్తుతుంది

Image credits: social media
Telugu

చెవి కణాలపై ప్రభావం

85 dB కంటే ఎక్కువ శబ్దం చెవులకు హానికరం. తీవ్రమైన శబ్దాలు వినడం వల్ల చెవుల్లోని కణాలు దెబ్బతిని వినికిడి శక్తిని ప్రభావితం చేస్తాయి.

Image credits: social media
Telugu

చెవి పొరలు

ఇయర్‌బడ్స్ వల్ల శబ్ద తీవ్రత నేరుగా చెవి పొర, లోపలి చెవిపై పడుతుంది. అటువంటప్పుడు ఆ తీవ్రత చెవుల లోపలి భాగాలకు చాలా హానికరం. భారీ శబ్దాల వల్ల చెవి లోపల కణాలు కాలక్రమేణా దెబ్బతింటాయి

Image credits: social media
Telugu

దీర్ఘకాలంలో

ఇయర్‌బడ్స్ వల్ల వినికిడి శక్తి ఒకటి లేదా రెండు రోజుల్లో కాదు, దీర్ఘకాలికంగా వాడితే ప్రభావితం అవుతుంది. మీరు కూడా ఎక్కువ శబ్దంతో ఇయర్‌బడ్స్ వాడుతుంటే జాగ్రత్త.

Image credits: social media
Telugu

తప్పని సరి అయితే..

ఇయర్‌బడ్స్ వాడక తప్పనిసరి అయితే, ఎక్కువసేపు వాడకుండా విరామం తీసుకుంటూ వాడండి. ఇయర్‌ బడ్స్‌, ఇయర్‌ ఫోన్స్‌ వాడేవారు తక్కువ శబ్దంలోనే ఉపయోగించండి. 

Image credits: social media
Telugu

ఓవర్ ది ఇయర్ హెడ్‌ఫోన్స్

ఇయర్‌బడ్స్‌కి బదులుగా ఓవర్ ది ఇయర్ హెడ్‌ఫోన్స్ వాడటం మంచిది. చెవిపై పెట్టుకునే హెడ్‌ఫోన్స్ వల్ల ధ్వని చెవిలోకి నేరుగా వెళ్ళదు. కాబట్టి తక్కువ హాని కలుగుతుంది.  

Image credits: social media

Diabetes: షుగర్ పేషెంట్స్ కు వరం.. ఇవి తింటే షుగర్ అస్సలు పెరగదు!

Sleeping: సరిగా నిద్రలేకపోతే.. శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే?

Hair Care Tips: ఇదొక్కటి తింటే చాలు.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది!

Acid Reflux : తరచూ గొంతులో త్రేన్పులు , ఛాతి మంట? ఈ చిన్న చిట్కాలతో..