డయాబెటీస్ పేషెంట్లు పండ్లను తినొచ్చా? లేదా?
డయాబెటీస్ పేషెంట్లు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తాయి.

fruits
డయాబెటీస్ ప్రధానంగా అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లే వస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో 100 మిలియన్లకు పైగా డయాబెటీస్ పేషెంట్లు ఉన్నారు. అలాగే 136 మిలియన్ల మందికి ఇది వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ వ్యాధి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆహారం, శారీరక శ్రమ, జీవన శైలి వంటి ఎన్నో కారణాల వల్ల టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఇదంతా పక్కన పెడితే డయాబెటీస్ పేషెంట్లు పండ్లను తినొచ్చా? లేదా? అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
fruits
డయాబెటీస్ ఉన్నవారు పండ్లను తినొచ్చా?
నిపుణుల ప్రకారం.. డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా పండ్లను ఎంచక్కా తినొచ్చు. ఎన్నో పండ్లలో డైటరీ ఫైబర్, పొటాషియం, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కొవ్వు, సోడియం, కేలరీలు తక్కువగా ఉంటాయి.
దీని చుట్టూ ఉన్న అపోహలు ఏంటి?
డయాబెటిస్ రోగులలో పండ్ల వినియోగం పై ఎన్నో అపోహలు ఉన్నాయి. డయాబెటీస్ పేషెంట్లు పండ్లకు పూర్తిగా దూరంగా ఉండాలని కొందరు చెబుతుంటారు. ఇంకొంతమంది మొత్తం పండ్ల ఆహారాన్నే తీసుకోవాలని చెబుతుంటారు. మరికొందరు పండ్లను కాకుండా పండ్ల రసాలను, స్మూతీలను తీసుకోమని సూచిస్తున్నారు. నిజమేంటంటే.. పండ్లను మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచి మేలు జరుగుతుంది.
Image: Trang Doan/pexels.com
పండ్లలు చక్కెర రక్తంలో స్థాయిని ప్రభావితం చేస్తాయా?
పండ్లలో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది కాలేయం ద్వారా తీసుకోబడుతుంది. అలాగే గ్లూకోజ్ గా మార్చబడుతుంది. అలాగే ఇది రక్తంలోకి విడుదల అవుతుంది. కాబట్టి పండ్లు గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి. పండ్లలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్ శోషణను నెమ్మదిస్తుంది. అలాగే గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. పండ్లలోని గ్లైసెమిక్ ఇండెక్స్ ను పరిగణలోకి తీసుకుని తినాల్సి ఉంటుంది. పండ్లను మితంగా తీసుకోవడం మంచిది.
డయాబెటిస్ పేషెంట్లు పండ్లను ఎలా తినాలి?
పరిగడుపున కడుపుతో పండ్లను తినడం అంత మంచిది కాదు. కానీ వీటిని భోజనంతో తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. భోజనానికి ముందు లేదా తర్వాత పండ్లను తినడం వల్ల వాటి పోషక విలువలు తగ్గవని నిపుణులు చెబుతున్నారు.
Fruits
డయాబెటిస్ ఉన్నవారికి ఏ పండ్లు మంచివి? ఏ పండ్లకు దూరంగా ఉండాలి?
డయాబెటిస్ పేషెంట్లు పండ్లను ఎక్కువగా తినొచ్చు. బొప్పాయి, జామ, ఆపిల్, నారింజ, పియర్, పుచ్చకాయ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, స్ట్రాబెర్రీ, చెర్రీలు, అవొకాడోలను మధుమేహులు తినొచ్చు. అయితే వీటిని ఎంత తినాలి అనేది వీటిలోని గ్లైసెమిక్ ఇండెక్స్ పై ఆధారపడి ఉంటుంది. ఒకసారి తినే దానిలో 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉండాలి. పండ్ల రసాలు, తయారుగా ఉన్న లేదా సంరక్షించబడిన పండ్లు, ఎండిన పండ్లను తినకపోవడమే మంచిది. అందుకే వీటిలో అదనపు చక్కెరలు ఉంటాయి. అందుకే ఇవి చాలా తీయగా ఉంటాయి.