మధుమేహులు నిమ్మకాయ తినొచ్చా?
నిమ్మకాయలు విటమిన్ సి కి మంచి వనరు. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో ఎన్నో అంటువ్యాధులు, రోగాల ముప్పు తగ్గుతుంది.

నిమ్మకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. నిమ్మలో విటమిన్ సి, విటమిన్ బి6, కాపర్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. నిమ్మకాయ మన రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
lemon
నిమ్మకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. పొటాషియం పుష్కలంగా ఉండే నిమ్మకాయ నీటిని తాగడం వల్ల అధిక రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. అలాగే ఇది మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
lemon
నిమ్మకాయలు విటమిన్ సి కి అద్బుతమైన వనరులు. దీనిలో విటమిన్ సి మాత్రమే కాదు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి నిమ్మకాయలను మధుమేహ వ్యాధిగ్రస్తులు ధైర్యంగా తినొచ్చు. నిమ్మకాయల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే దీనిలో శోథ నిరోధక పదార్ధాలు ఉంటాయి. ఇన్ని గుణాలున్న నిమ్మకాయలను మధుమేహులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
lemon
పిండి పదార్ధాలు ఎక్కువగా ఉండే అన్నం, పాస్తా, నూడుల్స్ వంటి ఆహార పదార్థాల్లో నిమ్మకాయ రసాన్ని జల్లడం వల్ల వాటిలోని గ్లైసెమిక్ ఇండెక్స్ ను నియంత్రించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలోని ఆమ్ల స్వభావం గ్లైసెమిక్ ఇండెక్స్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు చాలా త్వరగా జీర్ణమవుతాయి. శరీరంలో జీర్ణక్రియ సక్రమంగా జరిగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రించొచ్చు. నిమ్మలో ఉండే విటమిన్ సి, ఫైబర్ వేగంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీనిలో ఉండే పోషకాలు మెటబాలిజంను పెంచుతాయి.