MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Health
  • డయాబెటీస్ పేషెంట్లు పుట్టగొడుగులు తినొచ్చా?

డయాబెటీస్ పేషెంట్లు పుట్టగొడుగులు తినొచ్చా?

డయాబెటిస్ ఉన్నవారు పుట్టగొడుగులు తినొచ్చా? లేదా? అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. నిజానికి పుట్టగొడుగుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. పుట్టగొడుగుల్లో ప్రోటీన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 14 2023, 01:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Image: Getty Images

Image: Getty Images

ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. డయాబెటీస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. అయితే మధుమేహాన్ని నియంత్రించడానికి ఆహారం కీలక పాత్ర  పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు స్టార్చ్ తక్కువగా, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలనే తినాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను పుష్కలంగా తినడం  మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

డయాబెటిస్ ఉన్నవారు పుట్టగొడుగులను తినొచ్చా? లేదా? అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. పుట్టగొడుగులు మన ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. పుట్టగొడుగుల్లో ప్రోటీన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులలో విటమిన్ డి, విటమిన్ బి 2,  విటమిన్ బి 3 కూడా పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులను ప్రతిరోజూ తినడం వల్ల శరీరం శక్తివంతంగా మారుతుంది. అలాగే మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పుట్టగొడుగులు డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. 
 

39

పుట్టగొడుగుల్లో చక్కెర,  కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. తక్కువ కార్బ్ ఫుడ్ మధుమేహాన్ని నియంత్రించడానికి సహాయపడుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పుట్టగొడుగులు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కాపాడుతాయి. ఈ విధంగా పుట్టగొడుగులు డయాబెటీస్ పేషెంట్లకు మంచి మేలు చేస్తాయి. మరి పుట్టగొడుగులతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

49

విటమిన్ డి లోపం పోతుంది

ప్రస్తుతం చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ డి సూర్యరశ్మి ద్వారే కాదు ఇంకొన్ని ఆహారాల నుంచి కూడా మనకు అందుతుంది. పుట్టగొడుగులు విటమిన్ డి కి మంచి వనరులు. అందుకే పిల్లలకు విటమిన్ డి అందాలంటే పుట్టగొడుగులను ఆహారంలో చేర్చండి. 

59

అధిక రక్తపోటు

సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా ఉండే పుట్టగొడుగులను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య తగ్గిపోతుంది. దీనివల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 
 

69

చెడు కొలెస్ట్రాల్

చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణం పుట్టగొడుగులకు ఉందని నిపుణులు చెబుతున్నారు. పుట్టగొడుగులు శరీరంలో పేరుకుపోయిన అవాంఛిత కొవ్వును తొలగించడానికి, గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి.

79

రోగనిరోధక శక్తి

రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటేనే అంటువ్యాధులు, ఇతర రోగాల నుంచి మనం సేఫ్ గా ఉంటాం. అయితే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే పుట్టగొడుగులు కూడా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి గట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

89
Mushroom

Mushroom

ఎముకల ఆరోగ్యం

ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి కాల్షియం చాలా చాలా అవసరం. అయితే పుట్టగొడుగుల్లో కాల్షియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తిన్నాన ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. 
 

99

వెయిట్ లాస్

బరువు తగ్గాలనుకునే వారికి కూడా పుట్టగొడుగులు మంచి మేలు చేస్తాయి. 100 గ్రాముల పుట్టగొడుగుల్లో మూడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పుట్టగొడుగులను తినడం వల్ల మీరు ఫుడ్ ను తక్కువగా తింటారు. వీటిలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. వీటిని తింటే మీరు  ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 

చర్మ ఆరోగ్యం

పుట్టగొడుగుల్లో బీటా కెరోటిన్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులను తింటే కంటిచూపు మెరుగుపడుతుంది. అలాగే చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved