Diabetic Patients: షుగర్ పేషెంట్లు బెల్లం టీ తాగొచ్చా?
సాధారణంగా షుగర్ పేషెంట్లు చక్కెర పదార్థాలకు కాస్త దూరంగా ఉంటారు. టీ, కాఫీలు కూడా చక్కెర లేకుండా తీసుకుంటారు. కానీ చాలామంది షుగర్ పేషెంట్లు బెల్లం టీ తాగొచ్చు. ఏం కాదు అని చెబుతుంటారు. అసలు దాంట్లో నిజమెంతో? ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ వ్యాధి ప్రస్తుతం సర్వసాధారణం అయిపోయింది. నిజం చెప్పాలంటే ఇది లైఫ్ స్టైల్ కి సంబంధించిన సమస్య. షుగర్ ఉన్నవాళ్లు తినే, తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చక్కెరకు సంబంధించినవి తినకపోవడం మంచిది. చక్కెర వేసిన టీ కూడా వారు తాగకూడదు. మరి బెల్లం టీ తాగొచ్చా? తాగితే ఏమైనా సమస్యలు వస్తాయా? ఇక్కడ చూద్దాం.
బెల్లం టీ తాగొచ్చా?
టీ చాలామందికి ఇష్టమైన డ్రింక్. రోజుకు 4, 5 సార్లు కూడా టీ తాగుతుంటారు కొందరు. కానీ షుగర్ పేషెంట్ల పరిస్థితి ఇందుకు భిన్నం. వాళ్లు టీ తాగితే జబ్బును ఇంకా పెంచుకున్నట్లే. మరి వాళ్లు ఎలాంటి టీ తాగితే మంచిది? చాలామంది బెల్లం టీ తాగొచ్చు అనుకుంటారు. కానీ, నిజంగా తాగొచ్చా? దానివల్ల హాని లేదా?
ఆరోగ్యానికి హాని..
నిపుణుల ప్రకారం, డయాబెటిస్ ఉన్నవాళ్లు ఎలాంటి తీపి పదార్థాలు తినకూడదు. అది వాళ్ల ఆరోగ్యానికి అసలే మంచిది కాదు. ఎన్ని పోషకాలున్నా తినకూడదు. అందులో బెల్లం ఒకటి. బెల్లం సహజమైన తీపి పదార్థం. ఇందులో ఇనుము, కాల్షియం లాంటి పోషకాలు ఉన్నాయి. కానీ బెల్లంలో గ్లూకోజ్, సుక్రోజ్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.
షుగర్ కంట్రోల్ లో ఉంటే..
డయాబెటిస్ ఉన్నవాళ్లు బెల్లం తీసుకుంటే చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది. దీంతో ఇన్సులిన్ స్థాయి దెబ్బతింటుంది. షుగర్ కంట్రోల్ లో ఉంటే అప్పుడప్పుడు బెల్లం టీ తాగొచ్చు. కానీ, ముందుగా డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.
వీటిని మితంగా తినవచ్చు
షుగర్ ఉన్నవాళ్లకు తీపి పదార్థాల మీద కోరిక ఉంటే ఆరోగ్యకరమైన రీతిలో తీసుకోవచ్చు. పాల టీకి బదులుగా హెర్బల్ టీ తాగొచ్చు. ఆపిల్ ఆరెంజ్ లాంటివి మితంగా తినవచ్చు.