పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ ను గుర్తించే లక్షణాలు
రేడియేషన్ ఎక్స్పోజర్, హార్మోన్ థెరపీలు, ఇన్ఫెక్షన్లు, ఊబకాయం, వయస్సు, వంశపారంపర్యం, ఈస్ట్రోజెన్ మాత్రల వాడకం, సిరోసిస్ తో సహా తీవ్రమైన కాలేయ వ్యాధులు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

breast cancer in men
మహిళలకు వచ్చే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ సర్వసాధారణమైనది. ప్రస్తుత కాలంలో ఈ రొమ్ము క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ ఈ రొమ్ము క్యాన్సర్ కేవలం ఆడవాళ్లకే కాదు మగవారికి కూడా వస్తుంది. అయితే ఇది చాలా అరుదు. ఆడవాళ్లతో పోలిస్తే పురుషుల్లో రొమ్ము కణాలు తక్కువగా ఉంటాయి. కానీ పురుషుల్లో చిన్న చిన్న కణితులు వచ్చినా అవి సమీప కణాలకు వ్యాపించి క్యాన్సర్ గా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పలు గణాంకాల ప్రకారం.. ఒక వ్యక్తికి తన జీవితకాలంలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 1,000 మందిలో ఒకరికి ఉంటుంది.
ఎన్నో అంశాలు పురుషులల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. రేడియేషన్ ఎక్స్పోజర్, హార్మోన్ థెరపీలు, ఇన్ఫెక్షన్లు, ఊబకాయం, వయస్సు, వంశపారంపర్యం, ఈస్ట్రోజెన్ మాత్రల వాడకం, సిరోసిస్ తో పాటుగా ప్రమాదకరమైన కాలేయ వ్యాధులు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. నిపుణుల ప్రకారం.. పురుషులకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా అరుదే అయినప్పటికీ.. దీన్ని గుర్తించడంలో ఎంతో ఆలస్యం చేస్తారు. ఇది ప్రాణాల మీదికి తెస్తుంది. ఈ ప్రాణాంతక వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించాలంటే దీని లక్షణాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. అందుకే పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ వల్ల కలిగే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రొమ్ములో గడ్డలు
పురుషులలో రొమ్ము క్యాన్సర్ ప్రధాన లక్షణాలలో ఒకటి.. మహిళల మాదిరిగానే రొమ్ములలో చిన్న ముద్దలు, గడ్డలు కనిపించడం.
చనుమొనల్లో రక్తస్రావం
రొమ్ము క్యాన్సర్ వస్తే పురుషుల చనుమొనలో రక్తస్రావం, ఉత్సర్గ మొదలైనవి బయటకు వస్తాయి. అలాగే రొమ్ము ప్రాంతం చుట్టూ ఉన్న చర్మంలో మార్పులు వస్తాయి. అసౌకర్యంగా, నొప్పిగా కూడా ఉంటుంది.
Breast cancer
చనమొనల చుట్టూ మచ్చలు
రొమ్ము క్యాన్సర్ ఉండే కొన్ని కొన్ని సార్లు చనుమొన చుట్టూ ఎర్రగా ఉంటుంది. అలాగే అక్కడి చర్మం డ్రైగా మారుతుంది. అలాగే చనుమొన చుట్టూ మచ్చలు కూడా కావొచ్చు.
చనుమొనలు లోపలికి
రొమ్ము క్యాన్సర్ ఉంటే చనుమొన లోపలికి నెట్టబడినట్టుగా అనిపిస్తుంది. ఈ లక్షణాన్ని తేలిగ్గా తీసిపారేయకండి.
breast cancer
చనుమొనపై గాయం
రొమ్ము క్యాన్సర్ వల్ల చనుమొనపై ఏదో గాయం అయినట్టుగా అనిపిస్తుంది. ఇది రొమ్ము క్యాన్సర్కు సంకేతం కావొచ్చు.
వాపు
చంకల్లోని గ్రంథుల వాపు కూడా రొమ్ము క్యాన్సర్ లక్షణమే కావొచ్చంటున్నారు నిపుణులు.