- Home
- Life
- Health
- Health Tips: పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతున్నారా.. అయితే నులిపురుగుల సమస్యలే కావచ్చు?
Health Tips: పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతున్నారా.. అయితే నులిపురుగుల సమస్యలే కావచ్చు?
Health Tips: సాధారణంగా పిల్లలు కడుపునొప్పి అనగానే పిల్లలు ఇది మామూలే అని లైట్ తీసుకుంటాం కానీ ఒకసారి ఆలోచించండి. పిల్లలు నులిపురుగులతో బాధపడుతున్నారేమో.. అందుకే ఆ లక్షణాలు నివారణ మార్గాలు ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా పిల్లలు నులిపురుగులతో బాధపడే పిల్లలు వాంతులు విరోచనాలు రక్తహీనత మరియు కడుపునొప్పి, అన్నివేళలా ఆకలితో ఉండటం, మలంలో రక్తం వంటి లక్షణాల తో బాధపడుతూ ఉంటారు. సాధారణంగా పరాలజీవుల సమూహం వల్ల మానవులలో సంభవించే అత్యంత సాధారణ ఇన్ఫెక్షన్లలో మట్టి ద్వారా సంక్రమించే హెల్మింత్ ఇన్ఫెక్షన్ ఒకటి.
ఈ ఇన్ఫెక్షన్ కి సరైన చికిత్స తీసుకోకపోతే అది పిల్లల పెరుగుదల మీద తీవ్రంగా ప్రభావితం చూపిస్తాయి. ఈ పేగు పరాన్న జీవులలో కొన్ని ప్రాణాంతకం కూడా కావచ్చు అందువల్ల నిర్లక్ష్యం చేయకూడదు.
పురుగులు పిల్లలను పేగు అడ్డంకి వంటి వ్యాధుల తో మరింత హాని చేస్తాయి. కాబట్టి సరైన చికిత్స విధానం తీసుకోవడం అత్యంత అవసరం. పిల్లల వయస్సు పేగులకు సోకిన పురుగు రకం, పురుగు వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు మొదలైన వాటి ఆధారంగా చికిత్స సిఫారసు చేయబడింది.
సాధారణంగా నులిపురుగులు అనగానే మనం వాడే కొన్ని మందులు చూద్దాం. మే బెండజోల్ ను పిల్లలలో వివిధ రకాల పురుగుల ఇన్ఫెక్షన్ల చికిత్స కోసం ఉపయోగిస్తారు. జెంటిల్ 400ఎంజి రెండు సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పిల్లలకు మంచి చికిత్సని అందించే పురుగుల మందు.
జెంటిల్ సస్పెన్షన్ అనేది రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు మంచి ఔషధం. పైరాంటల్ కూడా పిల్లలకు సురక్షితమైన నివారణ ఔషధం. అలాగే మెబెండజోల్ కూడా సురక్షితమైన ఔషధం. అయితే వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ మందులను వాడకూడదు.
పిల్లవాడు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నప్పుడు సరియైన పోషక ఆహారం ఇవ్వడం కూడా ఎంతో అవసరం అదే సమయంలో పరిసరాలని ఆరోగ్యంగా ఉంచుకోవడం కూడా అవసరం. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే ఇవ్వండి. దీనివలన పిల్లవాడు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.