కోడిగుడ్డుతో జుట్టుకు కలిగే లాభాలు ఏంటో తెలుసా?
కోడిగుడ్డు (Egg) ఒక పోషక గని. కోడిగుడ్డులోని అనేక ప్రొటీన్లు ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన పోషకాలను అందించి శరీర ఆరోగ్యాన్ని మెరుగు పరచడంతో పాటు చర్మ సౌందర్యాననికి, జుట్టు సంరక్షణకు సహాయపడుతుంది. కోడిగుడ్డులో బీ-కాంప్లెక్స్, బయోటిన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు కావలసిన పోషకాలను అందించి జుట్టు బలంగా, ఒత్తుగా పెరగడానికి సహాయపడుతాయి. అందుకే ఇన్ని పోషకాలు గల గుడ్డును హెయిర్ ప్యాక్ లలో వాడితే జుట్టు పెరగడానికి చక్కగా పని చేస్తుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా కోడిగుడ్డు జుట్టు సంరక్షణకు (Hair care) ఏవిధంగా సహాయపడుతుందో తెలుసుకుందాము..

కలుషిత వాతావరణం, నిత్యం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు (Nutrients) లేకపోవడం వంటి కారణాలతో జుట్టు నిర్జీవంగా, పలుచగా మారి ఎక్కువ మొత్తంలో రాలిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు జుట్టు పెరగడం ఆగిపోతుంది. ఇలా ఆగిపోయిన జుట్టు తిరిగి ఒత్తుగా, మందంగా పెరగడానికి కోడిగుడ్డు సమర్థవంతంగా పనిచేస్తుంది. కోడిగుడ్డు జుట్టుకు మంచి కండిషనర్ (Conditioner) గా కూడా పనిచేస్తుంది.
కోడి గుడ్డులో నియాసిన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు (Minerals) పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు కోడిగుడ్డులోని లూటిన్ (Lutein) అనే పదార్థం జుట్టుకు కావలసిన తేమను అందించి జుట్టు ఒత్తుగా, దృడంగా పెరగడానికి సహాయపడుతుంది. అయితే ఇప్పుడు ఇంట్లోనే సహజసిద్ధమైన పద్ధతిలో కోడిగుడ్డుతో చేసుకునే హెయిర్ ప్యాక్ ల గురించి తెలుసుకుందాం.
అందమైన జుట్టు సౌందర్యం కోసం: ఒక గిన్నెలో ఒక కోడిగుడ్డు (Egg), ఒక స్పూన్ ఆలివ్ నూనె (Olive oil), ఒక స్పూన్ బాదం నూనె (Almond oil), కొంచెం పెరుగు (Curd) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మాడు నుంచి జుట్టు మొత్తానికి బాగా పట్టించాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడంతో జుట్టు అందంగా, ఒత్తుగా, పెరుగుతుంది. జుట్టుకు మంచి రంగు కూడా అందుతుంది.
జుట్టు సంరక్షణకు హెయిర్ కండిషనర్: కోడిగుడ్డు జుట్టుకు మంచి హెయిర్ కండిషనర్ గా సహాయపడుతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో కోడిగుడ్డు (Egg) కొంచెం నిమ్మరసం (Lemon juice) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా అప్లై చేసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో గాఢత తక్కువగా ఉండే షాంపూ తో తలస్నానం చేయాలి. ఇది జుట్టుకు మంచి హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టుకు సహజమైన నిగారింపు అందించి మెరిసేలా చేస్తుంది.
మంచి నిగారింపును అందిస్తుంది: పొడిబారి నిర్జీవంగా మారిన జుట్టు కోసం కోడిగుడ్డులోని తెల్ల సొన (White yolk) చక్కగా పనిచేస్తుంది. కోడిగుడ్డులోని తెల్లసొనను జుట్టుకు అప్లై చేసుకుని అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇది పొడిబారిన జుట్టుకు (Dry hair) తగినంత తేమను అందించి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.