తలలో ఇన్ఫెక్షన్‌లు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే!
చాలామంది అందంగా (Beautiful) కనిపించడం కోసం ముఖ సౌందర్యం కోసం ఎక్కువ శ్రద్ధ పెడతారు. కానీ అందంగా కనిపించాలంటే ముఖ సౌందర్యంతో పాటు జుట్టు సంరక్షణ (Hair care) కూడా ముఖ్యమే.

hair infections
ముఖం ఎంత అందంగా ఉన్నా జుట్టు ఒత్తుగా, పొడవుగా లేకుండా పలుచగా ఉండి నిర్జీవంగా కనిపిస్తే ముఖ సౌందర్యం కూడా తగ్గుతుంది. కనుక జుట్టు సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెడితే ఒత్తయిన, పొడవైన, సిల్కీ జుట్టు మీ సొంతం అవుతుంది. మరి ఇందుకు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
hair infections
రోజు రోజుకి పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం, శరీరంలోని హార్మోన్ల మార్పు, కొన్ని మందుల వాడకం, పోషకాహార లోపం, అధిక మొత్తంలో కెమికల్స్ కలిగిన హెయిర్ ప్రొడక్ట్స్ వాడకం జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి (Harms hair health). దీంతో జుట్టు ఎక్కువ మొత్తంలో ఊడిపోతుంది. కనుక జుట్టు సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ (Special attention) తీసుకోవాలి.
hair infections
వాతావరణ కాలుష్యం కారణంగా తల, జుట్టులో దుమ్ము, ధూళి అధికంగా చేరి తలభాగం అపరిశుభ్రంగా ఉంటుంది. దీంతో జుట్టు సమస్యలు (Hair problems) ఏర్పడతాయి. కనుక తల, జుట్టును శుభ్రంగా ఉంచుకునేందుకు తరచూ తలస్నానం (Head bath) చేయాలి. దీంతో తలభాగం శుభ్రంగా ఉంటుంది. తలస్నానానికి గాడత తక్కువ గల షాంపులను ఉపయోగించాలి.
hair infections
తలస్నానానికి షాంపూలకు బదులుగా కుంకుడు, సీకాయిలను ఉపయోగిస్తే మంచిది. వీటిని ఉపయోగిస్తే జుట్టుకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ (Side effects) కలగవు. తలస్నానం తరువాత జుట్టు కుదుర్లను ఆరోగ్యంగా ఉంచడానికి కండిషనర్ (Conditioner) ను అప్లై చేసుకోవడం మంచిది. దీంతో జుట్టురాలే సమస్యలు తగ్గుతాయి.
hair infections
అలాగే కొబ్బరినూనె, ఆలివ్, బాదం వంటి ఇతర నూనెలను జుట్టుకు పట్టించాలి. ఈ నూనెలు జుట్టు కుదుళ్లకు కావలసిన పోషకాలను అందించి జుట్టు కుదుర్లను (Hair follicles) బలపరుస్తాయి. కనుక వారానికి రెండు మూడు సార్లు అయినా ఈ నూనెలను వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు, జుట్టుకు బాగా మసాజ్ (Massage) చేసుకోవాలి.
hair infections
ఇలా చేస్తే తలభాగంలో రక్తప్రసరణ (Blood circulation) మెరుగుపడి జుట్టు ఆరోగ్యం బాగుంటుంది. దీంతో జుట్టు బలంగా మారుతుంది. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగడానికి మనం తీసుకునే ఆహారం కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కనుక అధిక ప్రోటీన్లు (Proteins) ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇవి జుట్టుకు కావలసిన పోషకాలను అందించి వాటి పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
hair infections
అలాగే తలలో ఏర్పడే ఇన్ఫెక్షన్ (Infection) లను కూడా తగ్గిస్తాయి. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి, మంచి నివారింపు కోసం ఇంటిలోనే తయారు చేసుకునే సహజసిద్ధమైన హెయిర్ ప్యాక్స్ (Hair packs) ను మాత్రమే ఉపయోగించాలి. ఇందుకోసం నిమ్మరసం, పెరుగు, గుడ్డు, మందారం, గోరింటాకు వంటి పదార్థాలతో తయారుచేసుకునే హెయిర్ ప్యాక్స్ ను ఉపయోగించడం మంచిది.