ఈ టిప్స్ పాటిస్తే చాలు.. బంగాళదుంపతో గోల్డెన్ స్కిన్ మీ సొంతం!
మెరుగైన చర్మ సౌందర్యం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారా! అయినా తగిన ఫలితం దొరకట్లేదా! అయితే మీ చర్మ సౌందర్యం కోసం బంగాళదుంపలతో (Potato) చేసుకునే ఫేస్ ప్యాక్ లను ట్రై చేస్తే మంచి ఫలితం ఉంటుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అందరి వంటింటిలో అందుబాటులో ఉండే బంగాళదుంప ఆరోగ్య ప్రయోజనాలతో పాటు చర్మ, జుట్టు సౌందర్యాన్ని పెంచుతుంది. బంగాళదుంప శరీరానికి కావలసిన పోషకాలను అందించి అన్ని చర్మ సమస్యలను నయం చేస్తుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా బంగాళదుంపలతో కలిగే బ్యూటీ బెనిఫిట్స్ (Beauty Benefits) గురించి తెలుసుకుందాం..

బంగాళదుంపలలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బి, సి, స్ట్రార్చ్ (Starch) చర్మ సౌందర్యాన్ని (Skin beauty) మెరుగుపరుస్తాయి. చర్మానికి మంచి రంగును అందించి కాంతివంతంగా మారుస్తుంది. కళ్ళ కింద ఏర్పడిన నల్లటి వలయాలను తొలగిస్తుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం బంగాళదుంపలను ఏ విధంగా ఉపయోగిస్తే చర్మ సౌందర్యం మెరుగు పడుతుందో తెలుసుకుందాం..
ముడతలను, మచ్చలను తగ్గిస్తుంది: ఒక కప్పులో బంగాళదుంప గుజ్జు (Potato mash), కొద్దిగా పెరుగు (curd) వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి కనీసం రెండుసార్లు చేస్తే ముఖంపై ముడతలు, మచ్చలు తగ్గుతాయి.
నేచురల్ బ్లీచ్ గా సహాయపడుతుంది: ఇందుకోసం ఒక కప్పులో బంగాళదుంప గుజ్జు (Potato mash), కొద్దిగా నిమ్మరసం (Lemon juice) వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ నేచురల్ బ్లీచ్ గా సహాయపడి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
చర్మానికి మంచి నిగారింపును అందిస్తుంది: ఒక కప్పులో బంగాళదుంప రసం (Potato juice), కొద్దిగా నిమ్మరసం (Lemon juice), తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇది చర్మానికి మంచి నిగారింపును అందిస్తుంది.
డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తుంది: ఒక కప్పులో బంగాళదుంప పేస్టు (Potato mash), కొద్దిగా తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోగా తయారైన మిశ్రమాన్ని కంటి చుట్టూ అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే కళ్ళకింద ఏర్పడ్డ డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి.
జుట్టుకు మంచి నిగారింపును ఇస్తుంది: ఇందుకోసం ఒక కప్పులో బంగాళాదుంప రసం (Potato juice), కోడి గుడ్డు తెల్లసొన (egg white), కొద్దిగా నిమ్మరసం (Lemon juice) వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసుకోవాలి. గంట తరువాత గాఢత తక్కువగల షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు
ఆరోగ్యం మెరుగుపడి మంచి నిగారింపు అందుతుంది.