Health Tips: షుగర్ తో ఏమి తినలేకపోతున్నారా.. అయితే మీ కోసమే ఈ హెల్దీ ఫుడ్ ఐటమ్స్?
Health Tips: చాలా మంది ప్రజలు షుగర్ వలన బాధపడుతూ తమకి ఇష్టమైన ఫుడ్ ని తినలేక పోతున్నారు. అలాంటి వాళ్ల కోసమే పూర్తి క్యాలరీలతో కూడుకున్న ఆరోగ్యకరమైన ఫుడ్ రెసిపీస్ ఇక్కడ చూద్దాం.
మధుమేహంతో ఉన్నవారు ఏం తినాలన్నా రక్తంలో చక్కెర స్థాయి గురించి కంగారుపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు అల్పాహారంగా ప్రోటీన్లు మరియు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోండి. ఇలాంటి వాళ్లు గుడ్లు తినడంలో ఏమాత్రం సంకోచించకండి. ఒక గుడ్డు కి 70 క్యాలరీలు మరియు ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
అలాగే పిండి పదార్థం ఒక గ్రాము కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్ రోజుకి ఒక గుడ్డు కచ్చితంగా తినవచ్చు. అలాగే పెరుగులో ఉండే బయోటిన్స్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కాబట్టి పెరుగు కూడా షుగర్ పేషెంట్లు తినవచ్చు.
అలాగే ఓట్ మిల్ లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది. మరియు ఎక్కువసేపు మీ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. కార్బో కంటెంట్ ఉన్నప్పటికీ ఇది డయాబెటిక్ పేషెంట్ కి మంచి హెల్దీ ఫుడ్.
అరకప్పు ఓట్స్ లో ఒక కప్పు నీరు వేయడం ద్వారా తయారు చేయబడిన ఓట్ మీల్ లో 154 క్యాలరీలు, ప్రోటీన్లు 5.4 గ్రాములు, కొవ్వు 2.6 గ్రాములు, పిండి పదార్థాలు 27.4 గ్రాములు, ఫైబర్ 4.1 గ్రాము ఉంటుంది. అలాగే ఆవకాడో టోస్ట్ లో కూడా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి మరియు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది.
అవకాడో స్మూతీ వంటి తక్కువ కార్బ్ స్మూతీ ఒక సాధారణ అల్పాహారం ఎంపిక. అదనపు ప్రోటీన్ బూస్ట్ కోసం మీరు స్మూతీకి ప్రోటీన్ పౌడర్ జోడించవచ్చు. అలాగే గోధుమఉక, త్రుణ ధాన్యాలు చాలా ఫైబర్ ని కలిగి ఉంటాయి మరియు తక్కువ గ్లైసిమిక్ లోడ్ కలిగి ఉంటాయి.
ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలని తక్కువ మోతాదులో పెంచుతుంది. అలాగే తృణధాన్యాల పిండి తో తయారు చేయబడిన మెత్తటి పాన్ కేకులు డయాబెటిక్ పేషంట్లకి మంచి ఆహారం. కాబట్టి షుగర్ పెరిగిపోతుందేమో అనే భయంతో కడుపు మాడ్చుకోకుండా ఇలాంటి ఫుడ్ ని ప్రిపేర్ చేసుకోండి.