MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • మీ పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతున్నారా అయితే ఓ సారి ఇలా చేయండి?

మీ పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతున్నారా అయితే ఓ సారి ఇలా చేయండి?

పిల్లల్లో ఎక్కువ శాతం కడుపు నొప్పి (Abdominal pain) సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్యలు ఉన్నప్పుడు తినడానికి, తాగడానికి మారం చేస్తుంటారు. వారిలో చికాకు, కోపం వంటి లక్షణాలు కనపడతాయి. అయితే చిన్నపిల్లల్లో కడుపు నొప్పి సమస్యలు సర్వసాధారణం. కడుపు నొప్పి ఉన్నప్పుడు సహజ సిద్ధమైన చిట్కాలను (Naturally prepared tips) ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. వీటితో కడుపు నొప్పి సమస్య నుంచి తొందరగా విముక్తి లభిస్తుంది. అయితే కడుపు నొప్పి సమస్య అధికంగా ఉంటే తప్పకుండా డాక్టర్ను సంప్రదించడం అవసరం. అయితే డాక్టర్ దగ్గరకు వెళ్లే ముందు మీ ఇంటి చిట్కాలను ఒకసారి ట్రై చేయండి. వీటిని ట్రై చేయడం ఎంతో కొంత వరకు విముక్తి కలుగుతుంది. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా పిల్లల్లో సర్వసాధారణంగా ఏర్పడే కడుపు నొప్పి సమస్యలకు సహజసిద్ధమైన చిట్కాల గురించి తెలుసుకుందాం..  

2 Min read
Navya G Asianet News
Published : Dec 12 2021, 03:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

పిల్లల్లో కడుపు నొప్పి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కలుషిత ఆహారం (Contaminated food), కడుపులో ఇన్ఫెక్షన్లు, మలబద్దకం సమస్యలు, జీర్ణాశయ సమస్యలు (Gastrointestinal problems) వంటి అనేక కారణాలు పిల్లల్లో కడుపు నొప్పికి దారితీస్తాయి. ఇలా పిల్లల్లో కడుపు నొప్పి సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళడానికి వీలులేని సమయంలో ఇంట్లోనే దొరికే సహజసిద్ధమైన చిట్కాలను ఉపయోగించడం మంచిది. అయితే ఇప్పుడు ఇంట్లో దొరికే వస్తువులతోనే ఏవిధంగా పిల్లలలో కడుపు నొప్పి సమస్యలు తగ్గుతాయో తెలుసుకుందాం..
 

26
Asianet Image

పుదీనా టీ: పుదీనా (Mint) ఆకులతో చేసిన టీ పిల్లల కడుపు నొప్పిని తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది. ఇది కడుపులోని కండరాలు మృదువుగా చేసి తిన్న ఆహారం తేలికగా జీర్ణం (Digestion) అవ్వడానికి ఉపయోగపడే పిత్త ప్రభావాన్ని విస్తరింపచేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. పుదీనా టీ తాగితే ఉదర భాగం ఆరోగ్యంగా ఉంటుంది. దాంతో కడుపు నొప్పి సమస్యలు తగ్గుతాయి.
 

36
Asianet Image

పెరుగు: పెరుగు (Curd) కడుపు నొప్పిని తగ్గించడానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. పెరుగు అరుగుదలను పెంచుతుంది. ప్రతి రోజు పిల్లలకు ఒక కప్పు పెరుగు తినడం అలవాటు చేయాలి. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా (Good bacteria) జీర్ణక్రియను మెరుగు పరిచి తిన్న ఆహారం తొందరగా అరగడానికి సహాయపడుతుంది. పిల్లల్లో సాధారణంగా ఏర్పడి కడుపు నొప్పి సమస్యలు తగ్గుతాయి.
 

46
Asianet Image

అల్లం టీ: అల్లంలో యాంటీ ఇంన్ల్ఫమేటరీ (Anti-inflammatory) లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపులోని ఇన్ఫెక్షన్ లను తగ్గించి కడుపు నొప్పి సమస్య నుంచి విముక్తి కలిగిస్తాయి. జీర్ణాశయాన్ని మెరుగుపరుస్తాయి. పిల్లల్లో కడుపు నొప్పి సమస్యలు ఉన్నప్పుడు అల్లం (Ginger) టీ ఇవ్వాలి. కడుపు నొప్పి ఉన్నప్పుడు అల్లం టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది.
 

56
Asianet Image

తేలికపాటి ఆహారం ఇవ్వాలి: కడుపు నొప్పి ఉన్నప్పుడు పిల్లలు ఆకలి అన్నప్పుడు వారికి తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను ఇవ్వాలి. నూనె పదార్థాలను (Oil ingredients), జంక్ ఫుడ్ (Junk food) లను అస్సలు ఇవ్వరాదు. తేలికపాటి ఆహారం పిల్లలకు ఇచ్చినప్పుడు పొట్ట ఇబ్బందులను తగ్గించి తిన్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. దీంతో కడుపు నొప్పి సమస్యలు తగ్గి సాధారణ స్థితిలోకి వస్తారు.
 

66
Asianet Image

వేడిని అప్లై చేయండి: కడుపు మీద వేడి నీటి సంచిని (Hot water bag) పెట్టాలి. ఇలా కడుపుకు వేడి తగలడంతో రక్త ప్రసరణ (Blood circulation) మెరుగుపడి కొంతవరకూ కడుపు నొప్పి నుండి విముక్తి కలుగుతుంది. పిల్లల్లో కడుపు నొప్పి ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి.

About the Author

Navya G
Navya G
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved