ఈ నూనెతో బోలెడు లాభాలు.. దీన్ని మీ ఆహారంలో చేర్చుకుంటే ఈ సమస్యలన్నీ మాయం
ఆలివ్ ఆయిల్ లో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ నూనె క్యాన్సర్, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, అల్జీమర్స్, ఆర్థరైటిస్, ఊబకాయం వంటి ఎన్నో వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఆలివ్ ఆయిల్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. చాలా మందికి ఆలివ్ ఆయిల్ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే అనేక ప్రమాదకరమైన రసాయన పదార్థాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఎన్నో జీవనశైలి వ్యాధులతో పోరాడటానికి కూడా సహాయపడతాయి.
olive oil
ఆలివ్ ఆయిల్ లో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ నూనె క్యాన్సర్, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, అల్జీమర్స్, ఆర్థరైటిస్, ఊబకాయం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రక్తం గడ్డకట్టడం వల్ల లేదా రక్తస్రావం కారణంగా మెదడుకు రక్త ప్రవాహం నిరోధించబడుతుంది. దీనివల్ల స్ట్రోక్ వస్తుంది. ఆలివ్ ఆయిల్ ను తీసుకునేవారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
olive oil
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా ఆలివ్ ఆయిల్ సహాయపడుతుంది. వృద్ధాప్యంతో వచ్చే మెమోరీ పవర్ తగ్గడం వల్ల సమస్యలను తగ్గించడానికి కూడా ఆలివ్ ఆయిల్ కొంతవరకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నూనెలో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వు ఇన్సులిన్ ను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. అంటే ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
ఆలివ్ ఆయిల్ కూడా మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు, స్క్వాలేన్, ఒలియోకాంతల్ వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇది వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది.
ఆలివ్ నూనెలో హానికరమైన బ్యాక్టీరియాను నివారించే లేదా నాశనం చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. హెలికోబాక్టర్ పైలోరి అనేది కడుపులో నివసించే బ్యాక్టీరియా. ఇది కడుపు పూతలు, కడుపు క్యాన్సర్ కు కారణమవుతుంది. ఈ నూనె హెలికోబాక్టర్ కు వ్యతిరేకంగా పనిచేస్తుందని కనుగొనబడింది. ఇది ఎముకలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉందని నిపుణులు చెబబుతున్నారు.