పుదీనాతో ఇన్ని ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయా?
పుదీనా ఆకులు మంచి వాసన వస్తాయి. అలాగే రుచికరంగా కూడా ఉంటాయి. అంతేకాదు ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలుచేస్తాయి. ఈ ఆకులను ఉపయోగించి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు.
mint leaves
పుదీనా ఆకులను గార్నిషీగా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది మంచి సువాసన రావడమే కాకుండా.. ఫుడ్ ను కూడా టేస్టీగా చేస్తుంది. అంతేకాదు ఈ ఆకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగున్నాయి. పుదీనా వికారం, వాంతులు, జీర్ణశయాంతర అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. అలాగే మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. కణాలను కూడా రక్షిస్తుంది. పుదీనాలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.
పుదీనాలో మెంతోల్ ఉంటుంది. ఇది చల్లని అనుభూతిని కలిగిస్తుంది. వాయు మార్గాలను క్లియర్ చేస్తుంది. తలనొప్పిని తగ్గించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులతో ఇంకా ఏమేం ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
జలుబు తగ్గుతుంది
వెదర్ కూల్ గా ఉంటే చాలు చాలా మందికి జలుబు చేస్తుంది. జలుబు సర్వ సాధారణ సమస్య. అయితే ఈ సమస్యను తగ్గించడానికి పుదీనా ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం రోజూ ఒక కప్పు పుదీనా టీని తాగండి. ఈ టీ గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుంది.
Image: Getty
నెలసరి తిమ్మిరి
పీరియడ్స్ సమయంలో భరించలేని తిమ్మిరితో బాధపడుతుంటారు చాలా మంది. అయితే ఇలాంటి వారికి పుదీనా ఆకులు మంచి మేలు చేస్తాయి. పుదీన కండరాలను శాంతపరుస్తుంది. అసౌకర్యాన్నితగ్గించడానికి సహాయపడే యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి. పుదీనా రక్తాన్ని కూడా శుభ్రపరుస్తుంది.
mint leaves
చర్మ సమస్యలు
పుదీనా ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అలాగే చర్మ సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుంది. పుదీనాను ఉపయోగించి మొటిమలను తగ్గించుకోవచ్చు.
Image: Getty
ఒత్తిడిని తగ్గిస్తుంది
పుదీనా ఆకుల్లో మనకు విశ్రాంతి కలిగించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పుదీనా ఆకులను ఉపయోగించి ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు. అందుకే దీన్ని తక్షణమే విశ్రాంతి కలిగించే అరోమాథెరపీలో ఉపయోగిస్తారు. పుదీనా వాసన చూసినా మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
జీర్ణక్రియకు మంచిది
పుదీనా ఆకులు కూడా మన జీర్ణక్రియకు సహాయపడతాయి. కడుపు సమస్యలను కూడా పోగొడుతాయి. పుదీనాలో ఫైటోన్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్లు, మెంతోల్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తాయి. అంతేకాదు పుదీనా కడుపునకు సంబంధించిన సమస్యలను కూడా తగ్గిస్తుంది.