డయాబెటీస్ పేషెంట్లు నేరేడు పండ్లను తింటే ఏమౌతుందో తెలుసా?
ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే డయాబెటీస్ పేషెంట్లు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మధుమేహులకు నేరేడు పండ్లు మంచి మేలు చేస్తాయి.

పోషకాలు పుష్కలంగా ఉండే నేరేడు పండ్లు మన శరీరాన్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. ఈ పుల్లని తీపి పండ్లు డయాబెటిస్ రోగులకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. వీటిని తింటే శరీరంలో డయాబెటిస్ రిస్క్ కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటుగా వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు, గుండె జబ్బులు , స్ట్రోక్ ముప్పు కూడా తగ్గుతుంది. ఈ చిన్న సైజు పండు మన ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా కాపాడుతుంది. ఈ పండు మధుమేహులకు ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి నేరేడు విత్తనాలు, పండ్లు రెండూ సహాయపడతాయని ఎన్సీబీఐ తెలిపింది. ఇది ఇన్సులిన్ స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం.. నేరేడు రసం ద్వారా హైపర్ గ్లైసీమిక్ ఉన్న ఎలుకల్లో చక్కెర స్థాయి 12.29 శాతం తగ్గింది. సాధారణ ఎలుకలలో 5.35 శాతం తగ్గింది. నేరేడు పండ్లలో ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇనుము, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే బయో యాక్టివ్ మూలకాలు శరీరాన్ని ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంచుతాయి.
నేరేడు పండ్లలోని పోషకాలు
యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే నేరేడు పండ్లు రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పండ్లలో ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు, ఎన్నో ఫైటోకెమికల్స్ కూడా ఉంటాయి. ఇవే కాకుండా నేరేడు విత్తనాల్లో కూడా జాంబోలిన్ మూలకం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. వీటిని తింటే శరీరంలోని వ్యర్థ పదార్థాలు కూడా బయటకు పోతాయి. తక్కువ కేలరీల నేరేడు పండ్లను పౌడర్ గా కూడా ఉపయోగిస్తారు. దీని విత్తనాలను ఎండబెట్టి పొడి తయారు చేస్తారు.
విటమిన్ల పవర్ హౌస్
విటమిన్ల పవర్ హౌస్
నేరేడు పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది మీ శరీరంలో ఇనుము శోషణను పెంచడానికి బాగా సహాయపడుతుంది. దీనిలో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి ఫైటోకెమికల్స్ కూడా ఉంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీర రోగనిరోధక శక్తి బలపడుతుంది.ఇది మిమ్మల్ని డయాబెటిస్ నుంచి బయటపడేస్తుంది.
jamun fruit
బరువును తగ్గించడానికి సహాయపడుతుంది
నేరేడు పండ్లలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీనితో పాటుగా కేలరీలను తగ్గిస్తే మధుమేహాన్ని నియంత్రించొచ్చు. దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా ఆకలి కాదు. ఇది బరువు పెరగకుండా నివారిస్తుంది. అంతేకాదు జీర్ణ సంబంధ సమస్యల నుంచి కూడా రక్షిస్తుంది.
హిమోగ్లోబిన్
నేరేడు పండ్ల సహాయంతో శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుకోవచ్చు. దీనిలో విటమిన్ సి, ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలో ఎర్రరక్తకణాలకు కొదవ ఉండదు. నేరేడు పండ్లను తినడం వల్ల శరీరంలో బ్లడ్ పెరుగుతుంది. ఇది రక్తహీనత ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే అలసట కూడా తగ్గుతుంది.
Jamun
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
నేరేడు పండ్లలో పొటాషియంతో పాటుగా ఇతర పోషకాలు కూడా ఉంటాయి. శరీరంలో ఉండే పొటాషియం అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. దీంతోపాటుగా స్ట్రోక్ సహా ఇతర గుండె సంబంధిత సమస్యల ముప్పు కూడా తగ్గుతుంది. ఒక గిన్నె నేరేడు పండ్లు 55 మి.గ్రా పొటాషియంను అందిస్తాయి.