- Home
- Life
- Health
- Health Tips: పరగడుపున అరటి, పాలు తీసుకుంటున్నారా.. అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే?
Health Tips: పరగడుపున అరటి, పాలు తీసుకుంటున్నారా.. అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే?
Health Tips: సాధారణంగా అరటి పండ్లు పాలు లాంటివి తీసుకుంటే శరీరం బరువు పెరుగుతుంది అంటారు కానీ పరగడుపున అరటిపండు తిని వేడి నీళ్లు తీసుకోవడం వలన తగ్గుతుంది అంటున్నారు నిపుణులు. అదేంటో తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఒక మనిషి యొక్క ఆరోగ్యం ఆరోజు అతను తిన్న మొదటి ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. లెగుస్తూనే జంక్ ఫుడ్ తినడం వల్ల రోజంతా ఆ వ్యక్తి డల్ గా ఉంటాడు. కాబట్టి మీరు ఎప్పుడూ పొద్దున తినే ఆహారం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. పరగడుపున అరటిపండు తిని వేడి నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదంట.
అంతేకాకుండా ఓబకాయంతో బాధపడేవారు సన్నబడటం కోసం ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయంట అంతేకాకుండా ప్రొద్దున్న వేడి నీరు తాగడం వలన మనిషి ఏకాగ్రత శారీరక పనితీరు రోజంతా యాక్టివ్ గా ఉండడం జరుగుతుంది.
అలాగే పొద్దున్న నీరు తాగితే ఒత్తిడి కూడా తగ్గుతుందట. అలాగే మలబద్ధకం తో బాధపడేవారు పొద్దున్నే అరటి పండు తిని వెంటనే వేడి నీరు తాగితే మనం తిన్న ఆహారం బాగా జీర్ణమై మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు.
అలాగే పొద్దున్న అరటిపండు తినడం వల్ల సోడియం స్థాయి సమతుల్యతతో ఉంటుంది అందువలన రక్తపోటుని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. మీకు బాగా అలసటగా అనిపించినప్పుడు ప్రతిరోజు ప్రొద్దున్న ఒక అరటిపండు తినండి.
తర్వాత వేడి నీరు త్రాగండి ఇలా చేయడం వలన శరీరానికి శక్తిని ఇస్తుంది శారీరక బలహీనతను తొలగించి రోజంతా మిమ్మల్ని చురుగ్గా ఉంచేలాగా చేస్తుంది. అలాగే శరీరం నుంచి విషయాన్ని తొలగించి శరీర జీర్ణక్రియ మెరుగుపడేలాగా చేస్తుంది ఒకరి జీవక్రియ సరైన స్థాయిలో ఉంటే కొవ్వులు సులభంగా కరిగి ఉబకాయం తగ్గుతుంది.
అలాగే వేడి నీరు శరీరంలోని టాక్సిన్స్ విసర్జనను ప్రేరేపిస్తుంది. మరియు అరటి పండు లోని కాల్షియం విటమిన్ సి మరియు విటమిన్ b6 పుష్కలంగా ఉంటాయి ఇవి కిడ్నీ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాబట్టి ఎలాంటి అపోహలు లేకుండా పరగడుపున అరటిపండు తిని వేడి నీరు తాగండి.