టేస్టీ టేస్టీ యాలకుల టీ.. ఎన్ని అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందో తెలుసా?
యాలకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇలాంటి యాలకుల టీ తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఈ టీ అజీర్ణం నుంచి గ్యాస్ ట్రబుల్ వరకు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.
యాలకులను కేవలం మసాలా దినుసులు లాగే చూసేవారున్నారు. నిజానికి ఇవి మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ మసాలా దినుసుల్లో విటమిన్ బి6, విటమిన్ బి3, విటమిన్ సి, జింక్, కాల్షియం, పొటాషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ యాలకుల టీని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
cardamom tea
రెగ్యులర్ గా యాలకుల టీ ని తాగడం వల్ల అజీర్ణం సమస్య తగ్గుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు కూడా నయమవుతాయి. ఈ టీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతో సహాయపడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే యాలకుల టీ అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడతుంది. అందుకే అధిక రక్తపోటు పేషెంట్లు ఈ టీని తాగితే హై బీపీ కంట్రోల్ లో ఉంటుంది. యాలకులు మన గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. యాలకుల టీ గ్లూకోజ్ కొవ్వుగా నిల్వ అయ్యే అవకాశాలను తగ్గిస్తుంది. కాబట్టి మధుమేహులు కూడా యాలకుల టీని ఎలాంటి భయం లేకుండా తాగొచ్చు.
Cardamom
యాలకుల్లో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి. వర్షాకాలంలో దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలను తగ్గించుకోవడానికి యాలకుల టీని తాగడం మంచిది.
యాలకులు పొత్తికడుపులో కొవ్వు పేరుకుపోకుండా ఉండటానికి కూడా సహాయపడతాయి. మీకు తెలుసా? శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల మెటబాలిజం దెబ్బతింటుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. యాలకుల టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.
cardamom
యాలకులు ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి కూడా సహాయపడతాయి. ఈ సమస్యలతో బాధపడేవారు యాలకుల టీని రోజూ తాగితే మంచి ఉపశమనం పొందుతారు. ఈ టీ పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న యాలకులు నోటి దుర్వాసనను కూడా పోగొడుతాయి. అందుకే భోజనం చేసిన తర్వాత యాలకులను నమలడం లేదా యాలకుల టీ తాగడం వల్ల నోటిలో తాజా సువాసనను వస్తుంది. అలాగే నోటి దుర్వాసన నుంచి ఉపశమనం పొందుతారు.