జీడిపప్పును తింటే ఇన్ని రోగాలు తగ్గిపోతాయా?
జీడిపప్పును తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఈ పప్పు రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే చర్మ క్యాన్సర్ నుంచి రక్షించడానికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us

cashew
జీడిపప్పులో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పులో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు మంచి మొత్తంలో ఉంటాయి. అంతేకాదు ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు, మొక్కల సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో రోగాల నుంచి రక్షిస్తాయి. జీడిపప్పును తినడం వల్ల బరువు తగ్గడంతో పాటుగా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. అలాగే గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.
cashew
జీడిపప్పు ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి వనరు. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి పోషకాలు ఉంటాయి. జీడిపప్పు నీటిలో కరిగే పోషకాలను గ్రహించడానికి శరీరానికి సహాయపడుతుంది. దీనిలో ఆరోగ్యకరమైన పాలీఅన్శాచురేటెడ్, మోనోశాచురేటెడ్ కొవ్వులు కూడా ఉంటాయి. జీడిపప్పును లిమిట్ లో తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులను పెంచడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే అనారోగ్య కొవ్వుల ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది.
cashew
జీడిపప్పు తినడం వల్ల రక్తహీనత ప్రమాదం తగ్గుతుంది. ఇనుము లోపం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. శరీరంలో ఇనుము లోపాన్ని పోగొట్టడానికి జీడిపప్పును క్రమం తప్పకుండా తినాలని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. జీడిపప్పులో జింక్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమవుతాయి. చర్మ క్యాన్సర్ నుంచి రక్షించడానికి కూడా జీడిపప్పు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
cashew
డయాబెటిస్ పేషెంట్లకు కూడా జీడిపప్పు ప్రయోజనకరంగా ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్లకు అప్పుడప్పుడు వచ్చే తిమ్మిరిని తగ్గించడానికి జీడిపప్పు సహాయపడుతుంది. ప్రతిరోజూ గుప్పెడు జీడిపప్పును తినడం వల్ల రాత్రిపూట కాళ్ల నొప్పులు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిణలో ఉంటాయి. జీడిపప్పులోని జియాక్సంతిన్, లుటిన్ యాంటీఆక్సిడెంట్లు కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీడిపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. వయస్సుతో పాటుగా వచ్చే దృష్టి నష్టాన్ని నివారిస్తుంది.