ఈ కూరగాయ బీపీని తగ్గిస్తుంది తెలుసా?
బీట్ రూట్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఈ కూరగాయ మన శరీరంలో రక్తాన్ని పెంచడం నుంచి అధిక రక్తపోటును తగ్గించడం వరకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది.

blood pressure
ప్రస్తుతం చాలా మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఇది రక్త నాళాలలో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే సమస్య. అధిక రక్తపోటును సకాలంలో గుర్తించకపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే దీన్ని మొదట్లోనే గుర్తించాలి.
<p>beet root</p>
రక్తపోటు కారణంగా చాలా మంది గుండెపోటు, స్ట్రోక్ వంటి అనేక సమస్యలతో బాధపడుతుంటారు. ఒత్తిడి, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం, ధూమపానం, మద్యపానం వంటివి రక్తపోటును పెంచుతాయి. రక్తపోటు ఎప్పుడూ ఎక్కువగా ఉండే గుండె జబ్బుల రిస్క్ పెరుగుతుంది.
విపరీతమైన తలనొప్పి, ఛాతిలో నిరంతరం నొప్పి, తీవ్రమైన అలసట, మైకము, వికారం, వాంతులు, కంటిచూపు తగ్గడం, ఆందోళన వంటివి అధిక రక్తపోటు లక్షణాలు. రక్తపోటును నియంత్రించడానికి ఆహారంలో కొన్ని మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. మనం చేసే కొన్ని పనుల వల్ల అధిక రక్తపోటు సమస్య వస్తుంది.
Image: Getty
నిపుణుల ప్రకారం.. బీట్ రూట్ రక్తపోటును నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. ముదురు ఎరుపు కూరగాయల్లో డైటరీ నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. బీట్ రూట్ ను హైపర్ టెన్షన్ కు సూపర్ ఫుడ్ గా కూడా పిలుస్తారు.
ఆహారంలోని నైట్రేట్ శరీరంలోకి చేరినప్పుడు అది యాక్టివ్ నైట్రైట్, నైట్రిక్ ఆక్సైడ్ గా మారుతుందని అధ్యయనంలో తేలింది. అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడే రక్త నాళాలను సడలించడానికి నైట్రిక్ ఆక్సైడ్ కీలక పాత్ర పోషిస్తుంది.
beetroot
అధిక రక్తపోటును నియంత్రించడానికి రోజూ 250 మిల్లీలీటర్ల బీట్ రూట్ జ్యూస్ ను తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లండన్ లోని క్వీన్ మేరీస్ యూనివర్సిటీకి చెందిన బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
Image: Getty Images
మీ రక్తపోటును అదుపులో ఉంచడానికి మీ ఆరోగ్యం, రోజువారీ అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక రక్తపోటు, దాని లక్షణాలను నియంత్రించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. బరువు పెరగకూడదు. స్మోకింగ్ ను మానేయాలి. ఇవన్నీ అధిక రక్తపోటును నియంత్రించాలి.