గుమ్మడితో చర్మ సౌందర్యం.. ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
చర్మ సౌందర్యం కోసం అన్ని రకాల పండ్లు, కూరగాయలను ప్రయత్నించి ఉంటాం. అయితే ఈసారి గుమ్మడికాయను కూడా చర్మ సౌందర్యం కోసం ఉపయోగించండి..

గుమ్మడిలో ఉండే పోషకాలు చర్మానికి అనేక బ్యూటీ బెనిఫిట్స్ (Beauty Benefits) ను కలుగజేస్తాయి. ఇలా ఇంటిలోనే సహజసిద్ధమైన పద్ధతిలో తయారు చేసుకునే గుమ్మడికాయ ఫేషియల్స్ (Pumpkin Facials) చర్మానికి మంచి నిగారింపును అందిస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గుమ్మడికాయలో ఆల్ఫా, బీటా కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సమస్యలను (Skin problems) తగ్గించడానికి సహాయపడుతాయి. గుమ్మడికాయతో చేసుకునే ఫేషియల్స్ ను ఉపయోగిస్తే చర్మకణాలలో పేరుకుపోయిన మృతకణాలు (Dead cells) తొలగిపోతాయి. దీంతో చర్మం శుభ్రపడుతుంది. అలాగే సన్ టాన్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
గుమ్మడితో చేసుకునే ఫేషియల్స్ చర్మానికి మంచి మాయిశ్చరైజర్గా (Moisturizer) సహాయపడి చర్మానికి తగినంత తేమను అందిస్తాయి. ఫలితంగా చర్మం పొడిబారే సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే మొటిమలు, మచ్చలు, నల్లటి వలయాలు వంటి చర్మ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. కనుక గుమ్మడి ఫేషియల్స్ ను చర్మ సౌందర్యం (Skin beauty) కోసం ఉపయోగించండి.. అందాన్ని మరింత రెట్టింపు చేసుకోండి..
గుమ్మడి గుజ్జు: గుమ్మడికాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గుమ్మడి మిశ్రమాన్ని (Pumpkin mixture) ముఖానికి అప్లై చేసుకుని పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే చర్మం శుభ్రపడి (Cleanses the skin) చర్మ కాంతి మెరుగుపడుతుంది.
గుమ్మడి గుజ్జు, పాలు, తేనె, గుడ్డు తెల్లసొన: ఒక కప్పు తీసుకొని అందులో కొద్దిగా గుమ్మడి గుజ్జు (Pumpkin pulp), పాలు (Milk), తేనె (Honey), గుడ్డు తెల్లసొన (Egg white) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు బాగా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై ఏర్పడ్డ మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.
గుమ్మడికాయ, పెరుగు: ఒక స్పూన్ గుమ్మడి కాయ జ్యూస్ (Pumpkin Juice), రెండు స్పూన్ ల పెరుగు (Yogurt) తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ఫేషియల్ వృద్ధాప్య ఛాయలను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
గుమ్మడికాయ గుజ్జు, నిమ్మరసం, పంచదార: గుమ్మడికాయ గుజ్జుకి (Pumpkin pulp) కొద్దిగా నిమ్మరసం (Lemon juice), రెండు స్పూన్ పంచదార (Sugar) వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖానికి మంచి టోనర్ గా పనిచేసి స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది.