అందమైన ముఖ సౌందర్యం కోసం గుమ్మడి ఫేస్ ప్యాక్స్.. ఇలా చేస్తే అందమే అందం!
అందమైన ముఖ సౌందర్యం కోసం వినియోగించే క్రీముల్లో ఎంతోకొంత రసాయనాలు ఉంటాయి. వీటి కారణంగా చర్మం పలురకాల సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.

సహజసిద్ధమైన గుమ్మడికాయ (Pumpkin) గుజ్జుతో ఇంట్లోనే తయారు చేసుకునే ఫేస్ ప్యాక్స్ నిత్యం చర్మాన్ని ఆరోగ్యంగా ఉండడంతోపాటు చర్మ సౌందర్యాన్ని (Skin beauty) కూడా పెంచుతాయి. మరి ఈ పేస్ ప్యాక్ ల తయారీ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గుమ్మడికాయతో చేసుకునే ఫేస్ ప్యాక్స్ (Face packs) చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా మెరిసేలా సహాయపడుతుంది. అలాగే సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్‌గా (Moisturizer) కూడా సహాయపడుతుంది. గుమ్మడిని ఫేస్ ప్యాక్స్ లో ఉపయోగించడానికి ముందుగా దాన్ని ఉడికించుకొని మెత్తగా ముద్దలా చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న మెత్తని గుమ్మడి గుజ్జుతో ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవాలి.
చర్మ నిగారింపు కోసం: ఒక కప్పులో కొద్దిగా గుమ్మడి గుజ్జు (Pumpkin pulp), పెరుగు (Yogurt), కాస్త తేనె (Honey), కొన్ని చుక్కల నిమ్మరసం (Lemon juice) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరచుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను చర్మానికి తక్షణ నిగారింపును అందించి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
చర్మానికి మంచి స్క్రబ్ లా ఉపయోగపడుతుంది: ఒక కప్పులో కొద్దిగా గుమ్మడి గుజ్జు (Pumpkin pulp), కాస్త తేనె (Honey), ఒక స్పూన్ ఓట్స్ పొడిని (Oats powder) తీసుకొని ఫేస్ ప్యాక్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా సున్నితంగా మర్దన చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మానికి మంచి స్క్రబ్ గా పనిచేసి చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది.
చర్మానికి మంచి టోనర్ లా సహాయపడుతుంది: ఒక కప్పులో కొద్దిగా గుమ్మడి గుజ్జు (Pumpkin pulp), రెండు స్పూన్ ల చక్కెర (Sugar), కొద్దిగా నిమ్మరసం (Lemon juice) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ముఖానికి మంచి టోనర్ లా పనిచేసి చర్మానికి మంచి నిగారింపును అందిస్తుంది.
చర్మానికి మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది: ఒక కప్పులో కొద్దిగా గుమ్మడి గుజ్జు (Pumpkin pulp), కొద్దిగా పైన్ ఆపిల్ గుజ్జు (Pine apple pulp), యాపిల్ గుజ్జు (Apple pulp) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మానికి సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్‌గా సహాయపడి చర్మానికి తేమను అందిస్తుంది.
మొటిమలను తగ్గిస్తుంది: ఒక కప్పులో కొద్దిగా గుమ్మడి గుజ్జు (Pumpkin pulp), గుడ్డులోని తెల్లసొన (Egg white), కొద్దిగా తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చర్మం నిగారింపు పెరగడంతోపాటు మొటిమలు కూడా తగ్గుతాయి.