నిత్యం యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఈ ఒక్క టిప్ పాటించండి!
క్యారెట్ (Carrot) ను తీసుకుంటే ఆరోగ్యానికి మంచి ఫలితాలు అందుతాయని అందరికీ తెలుసు. అయితే క్యారెట్ ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కూడా మంచి ఫలితాలను అందిస్తుంది.

ఇది చర్మకణాలను తాజాగా ఉంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో అన్ని చర్మ సమస్యలను తగ్గించి కాంతివంతమైన మెరిసే చర్మ సౌందర్యాన్ని (Skin beauty) అందిస్తుంది. కనుక క్యారెట్ ను ఏవిధంగా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
క్యారెట్ లో బీటా కెరోటిన్లు (Beta carotenes), విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా ప్రతి రోజూ రెండు క్యారెట్ లను తింటే శరీరం ఆకర్షణీయంగా, అందంగా మారుతుంది. అలాగే క్యారెట్ తో ఇంటిలోనే సులభంగా తయారు చేసుకునే ఫేషియల్స్ (Facials) చర్మానికి మంచి ఫలితాలను అందిస్తాయి.
మొటిమలు, మచ్చలు తగ్గుతాయి: ఒక కప్పు తీసుకొని అందులో రెండు స్పూన్ ల క్యారెట్ రసం (Carrot juice), చిటికెడు దాల్చిన చెక్క పొడి (Cinnamon powder), ఒక స్పూన్ తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని అరగంట తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి కనీసం రెండు సార్లు చేస్తే మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి.
వృద్ధాప్య లక్షణాలు తగ్గుతాయి: ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో క్యారెట్ (Carrot) ముక్కలు, నానబెట్టుకున్న బాదం (Soaked almonds) పప్పును వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి అప్లై చేసుకుని అరగంట తరువాత స్నానం చేయాలి. ఇలా వారాలకొకసారి చేస్తే చర్మం బిగుతుగా మారుతుంది. దీంతో ముఖంపై ఏర్పడ్డ ముడతలు తగ్గిపోయి యవ్వనంగా కనిపిస్తారు.
చర్మానికి మంచి నిగారింపు అందుతుంది: ఎండకు కమిలి నల్లగా మారిన చర్మానికి మంచి నిగారింపును అందించడం కోసం క్యారెట్ ను ఉపయోగిస్తే మంచి ఫలితం (Good result) ఉంటుంది. క్యారెట్ ను మెత్తగా పేస్ట్ (Carrot paste) చేసి ఆ పేస్ట్ ను ముఖానికి, మెడకు, చేతులకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే సన్ టాన్ తొలగిపోయి చర్మానికి మంచి నిగారింపు అందుతుంది.
జిడ్డు చర్మ సమస్యలు తగ్గుతాయి: క్యారెట్ (Carrot), క్యాబేజీ (Cabbage), టమోటో (Tomato) ముక్కలను సమపాళ్లలో తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి సున్నితంగా మర్దన చేసుకుని అరగంట తరువాత శుభ్రపరుచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే జిడ్డు చర్మ సమస్యలు తగ్గుతాయి. దీంతో అందంగా కనిపిస్తారు.
మృతకణాలు తొలగిపోతాయి: ఒక కప్పులో క్యారెట్ రసం (Carrot juice), ఒక స్పూన్ పెరుగు (Yogurt), ఒక టేబుల్ స్పూన్ ఎగ్ వైట్ (Egg white), ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ (Olive oil) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చర్మ కణాలలో పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.