దానిమ్మ తొక్కల పొడితో సౌందర్యం రెట్టింపు అవ్వడం గ్యారెంటీ.. ఎలా ఉపయోగించాలంటే?
దానిమ్మ గింజలలో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు మనకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఈ గింజలలో ఉండే విటమిన్లు మనకు సహాయపడుతాయ్.

దానిమ్మ గింజలు మాత్రమే కాదు దానిమ్మ తొక్క (Pomegranate peel) కూడా మన చర్మ, జుట్టు సౌందర్యానికి మంచి ఫలితాలను అందిస్తాయని సౌందర్య నిపుణులు అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం దానిమ్మ తొక్కను చర్మ, జుట్టు సౌందర్యం (Skin and hair beauty) కోసం ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం..
ముందుగా దానిమ్మ తొక్కలను నీడలో ఎండబెట్టి పొడి చేసి ఒక గ్లాసు సీసాలో భద్రపరుచుకోవాలి. ఇలా తయారుచేసుకున్న దానిమ్మ తొక్కల పొడిలో చర్మానికి, జుట్టుకు ఉపయోగపడే అద్భుతమైన ఔషధ గుణాలు (Medicinal properties) దాగివున్నాయి. దానిమ్మ తొక్క సన్ స్క్రీన్ లోషన్ (Sunscreen lotion) వంటి గుణాలను కలిగి ఉంటుంది.
ఇది సూర్యకిరణాల నుంచి వెలువడే హానికరమైన అల్ట్రావేవ్ కిరణాల (Ultrawave beams) నుంచి చర్మానికి కలిగే హానిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది చర్మానికి మంచి స్క్రబ్ (Scrub) గా సహాయపడి చర్మ కణాలలో పేరుకుపోయిన మురికిని తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే చర్మ, జుట్టు సమస్యలన్నింటినీ తగ్గించి వాటి సౌందర్యాన్ని మరింత రెట్టింపు చేస్తుంది.
దానిమ్మ తొక్క పొడి, నిమ్మరసం: ఒక కప్పులో కొద్దిగా దానిమ్మ తొక్క పొడి (Pomegranate peel powder), కొద్దిగా నిమ్మరసం (Lemon juice) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే మొటిమలు, మచ్చలు, ముడతలు వంటి సమస్యలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.
దానిమ్మ తొక్క పొడి, పాలు: ఒక కప్పులో రెండు టేబుల్ స్పూన్ ల దానిమ్మ తొక్క పొడి (Pomegranate peel powder), పాలు (Milk) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని అరగంట తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే జిడ్డు సమస్యలు తగ్గుతాయి. దీంతో చర్మ సౌందర్యం మరింత రెట్టింపు అవుతుంది.
దానిమ్మ తొక్కల పొడి, రోజ్ వాటర్: ఒక కప్పులో దానిమ్మ తొక్కల పొడి (Pomegranate peel powder), రోజ్ వాటర్ (Rose water) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. అరగంట తరువాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమం చర్మానికి మంచి మాయిశ్చరైజర్ గా సహాయపడి చర్మానికి తేమను అందించి పొడిబారే చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
దానిమ్మ తొక్క పొడి, పెరుగు: ఒక కప్పులో దానిమ్మ తొక్కల పొడి (Pomegranate peel powder), పెరుగు (Yogurt) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా అప్లై చేసుకుని గంట తరువాత గాఢత తక్కువ గల షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్యలు, చుండ్రు వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.