అరటికాయ మసాలా పులుసు ఇలా చేస్తే రుచి అమోఘం!
పచ్చి అరటికాయ ఆరోగ్యానికి మంచిది (Good for health). పచ్చి అరటికాయతో చేసుకునే వంటలు భలే రుచిగా ఉంటాయి.

అరటికాయతో చేసుకునే మసాలా పులుసు రుచికి చేపల పులుసులాగా ఉంటుంది. అరటిపండును తినని పిల్లలకు ఇలా అరటి పండును కూర రూపంలో వండి పెడితే ఏ పేఛీ లేకుండా తింటారు. అంతేకాకుండా అడిగి మరీ చేయించుకుని తినడానికి ఇష్టపడతారు. ఈ పులుసును సులభంగా తక్కువ సమయంలో వండుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం అరటికాయ మసాలా పులుసు (Aratikaya masala pulusu) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: రెండు పచ్చి అరటికాయలు (Raw bananas), ఒక ఉల్లిపాయ (Onion), రెండు పచ్చిమిరపకాయలు (Green chilies), ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు (Tamarind), ఒక స్పూన్ ధనియాల పొడి (Coriander powder).
ఒక స్పూన్ జీలకర్ర పొడి (Cumin powder), ఒక టేబుల్ స్పూన్ కారం పొడి (Chilli powder), పావు స్పూన్ పసుపు (Turmeric), సగం స్పూన్ గరం మసాలా (Garam masala), రుచికి సరిపడా ఉప్పు (Salt), కొద్దిగా కొత్తిమీర (Coriander) తరుగు రెండు కరివేపాకు (Curry leaves) రెబ్బలు, పావు కప్పు నూనె (Oil).
తయారీ విధానం: అరటికాయలను తీసుకొని తొక్క తీసి మరీ పలుచగా కాకుండా కాస్త మందంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేగిన తరువాత ఉల్లిపాయ తరుగు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగి లైట్ బ్రౌన్ కలర్ (Light brown color) వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన (Raw smell) పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారంపొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మసాలా అన్నింటిని బాగా కలుపుకొని (Mix well) ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ వేగిన తరువాత చింతపండు పులుసు, ఒక గ్లాస్ నీళ్లు (Water) పోసి మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
చింతపులుసు (Chintapulusu) బాగా ఉడికిన తరువాత అరటికాయ ముక్కలు వేసి మూత పెట్టి తక్కువ మంట (Low flame) మీద బాగా ఉడికించుకోవాలి. అరటికాయ ముక్కలు బాగా ఉడికి కూర నుంచి నూనె పైకి తేలే వరకు ఉడికించుకొని చివరిలో గరం మసాలా, కొత్తిమీర తరుగు, కరివేపాకులు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అంతే ఎంతో రుచికరమైన (Delicious) అరటికాయ మసాలా పులుసు రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ కుటుంబ సభ్యులకు తప్పక నచ్చుతుంది. ఈ పులుసు అన్నం, రోటీలలోకి భలే రుచిగా ఉంటుంది.