Beauty Tips: అరటిపండు ముఖ సౌందర్యానికే కాదు.. కేశ సౌందర్యానికి కూడా మేలని మీకు తెలుసా?
Beauty Tips: అరటిపండు ఆరోగ్యానికి ఎంత ఉపయోగమో అందానికి కూడా అంతే ఉపయోగం. అయితే కేవలం చర్మ సౌందర్యానికే కాకుండా కేశ సౌందర్యానికి కూడా అరటిపండు వాడొచ్చు అది ఎలాగో చూద్దాం.
ప్రతిరోజు అరటిపండు తినటం వలన శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. అలాగే మానసిక ఆరోగ్యానికి అవసరమైన పెరిటోనిస్ అనే పదార్థం అరటి పండులో ఉంటుంది. చర్మ సమస్యలు అయినటువంటి మొటిమలు మొఖం పొడిబారడం వంటి సమస్యలని దూరం చేయటానికి అరటిపళ్ళు ఎంతో ఉపయోగపడతాయి.
దీనిలో ఉండే బి,ఏ,సి విటమిన్లే కాకా పొటాషియం చర్మానికి జుట్టుకి కూడా పోషకాలుగా దోహదపడతాయి. మొటిమలలోని ఉండే బ్యాక్టీరియాను అరటిపండు లోని పొటాషియం నశింప చేస్తుంది.
ఇందులో ఉండే బి విటమిన్ దురద వంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే చర్మం మంచి రంగులో కాంతివంతంగా మారటానికి అరటిపండు దోహదం చేస్తుంది. వయసు మీద పడినట్లు కనిపిస్తున్నామని భావించేవారు ఒక పండిన అరటిపండును తీసుకొని దానిని మెత్తని..
పేస్టులాగా చేసి ఒక చెంచా దేనిని కలిపి ముఖానికి పట్టించుకోని 30 నిమిషాలు పాటు ఉంచుకోండి ఎండిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేస్తే చర్మం లేతగా బిగుతుగా అవుతుంది. అలాగే ముఖం కూడా మృదువుగా తయారవుతుంది.
అలాగే ఒక అరటి పండులో ఒక టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలిపి దానిని జుట్టుకు పట్టించి తర్వాత వేడి నీటిలో నుంచి పిండిన టవల్ ని తలకి చుట్టుకుని 30 నిమిషాల పాటు ఉంచుకోండి తర్వాత గోరువెచ్చని నీటితో తలకు స్నానం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.
అలాగే అరటి పళ్ళు పొడిబారిన జుట్టుని మరమ్మత్తు చేసి సహజ స్థితికి తీసుకువస్తాయి. అరటి పండ్లలో ఉండే పొటాషియం మాడుపైన ఉండే బ్యాక్టీరియాని తొలగించి ఆరోగ్యవంతమైన జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. బాగా పండిన అరటిపండుని మాడుకి, జుట్టుకి పట్టించి 20 నిమిషాల పాటు ఉంచిన తర్వాత షాంపుతో స్నానం చేయడం వలన జుత్తు ఆరోగ్యంగా అవుతుంది.