ఇంట్లోనే బాదం పూరి స్వీట్ తయారీ.. ఎలా చెయ్యాలో తెలుసా?
పండుగ సమయాలలో బంధుమిత్రులతో కలిసి మంచి స్వీట్ తినాలనిపిస్తే ఎప్పుడూ చేసుకుlనే స్వీట్ లకు బదులుగా బాదం పూరి స్వీట్లు ట్రై చేయండి. దీని తయారీ విధానం చాలా సులభం. ఈ స్వీట్ ఐటమ్ చక్కెర పాకంతో నిండి భలే టేస్టిగా (Tasty) ఉంటుంది. ఈ స్వీట్ ఐటమ్ మీ పిల్లలకు బాగా నచ్చుతుంది. బయట నుంచి కొనే మిఠాయిలకు బదులుగా ఇలా ఇంట్లోనే వెరైటీగా తయారుచేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా బాదం పూరి (Badham puri) స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు: ఇరవై బాదంపప్పులు (Almonds), ఒకటిన్నర కప్పు మైదా (Maida), పావు స్పూన్ బేకింగ్ పౌడర్ (Baking powder), రెండు టేబుల్ స్పూన్ ల బొంబాయి రవ్వ (Bombay Ravva), ఒక కప్పు పంచదార (Sugar), సగం స్పూన్ యాలకుల పొడి (Cardamom powder), పావు కప్పు నెయ్యి (Ghee), పావు కప్పు పాలు (Milk), కొన్ని లవంగాలు (Cloves), ఢీ ఫ్రైకి సరిపడా ఆయిల్ (Oil).
తయారీ విధానం: ముందుగా బాదం పప్పులను కాసేపు వేడి నీటిలో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బాదంపప్పులను (Soaked almonds) తొక్కు తీసి మిక్సీలో వేసి నీళ్లు పోసి బాగా గ్రైండ్ (Grind) చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా, బేకింగ్ సోడా, బొంబాయిరవ్వ, ఒక స్పూన్ చక్కెర, రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యి వేసి కలుపుకోవాలి.
తర్వాత ఇందులో మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్, పాలు పోసి పూరి పిండిలా బాగా కలుపుకొని (Mix well) పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకం కోసం ఒక గిన్నెలో ఒక కప్పు చక్కెర, సగం కప్పు నీళ్లు పోసి తీగపాకం వచ్చే వరకు మరిగించాలి. చివరిలో సగం స్పూన్ యాలకుల పొడి (Cardamom powder) వేసి దింపేయాలి.
ఇప్పుడు కలుపుకున్న మైదా పిండిని చిన్న ఉండలుగా తీసుకుని మందంగా పూరీలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న పూరిపై నెయ్యి రాసి సగానికి మడిచి తరువాత త్రికోణాకారంలో (Triangular) మడిచి లవంగాన్ని (Clove) గుచ్చాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని తయారు చేసుకోవాలి.
ఇప్పుడు వీటి ఢీ ఫ్రై కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఢీ ఫ్రైకి సరిపడా ఆయిల్ (Oil) వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తరువాత ఇందులో తయారు చేసుకున్న పూరీలను వేసి మంచి కలర్ వచ్చేంత వరకూ రెండు వైపులా తక్కువ మంట (Low flame) మీద వేయించుకోవాలి.
ఇలా ఫ్రై చేసుకున్న పూరీలను చక్కెర పాకంలో వేయాలి. పూరీలకు చక్కెర పాకం (Caramel) బాగా పట్టిన తరువాత తీసి మరొక ప్లేటులో ఉంచుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన బాదం పూరి స్వీట్ రెడీ (Ready). ఇంకెందుకాలస్యం వీటిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.