MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Life
  • Health
  • తేనెలో నానబెట్టిన ఉసిరికాయలను తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో..!

తేనెలో నానబెట్టిన ఉసిరికాయలను తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో..!

ఉసిరి, తేనె రెండింటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే తేనెలో ఉసిరికాయను నానబెట్టి తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారని నిపుణులు చెబుతున్నారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 08 2023, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఉసిరికాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. అయితే ప్రతిరోజూ ఉదయం ఉసిరికాయను తేనెలో నానబెట్టిన తినడం మంచి అలవాటని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. తేనెలో నానబెట్టిన ఉసిరి నిజంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. 

జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం, జీర్ణక్రియను పెంచడం వంటి వివిధ ప్రయోజనాల కోసం ఉసిరిని తినమని ఎక్కువగా చెప్తుంటారు. అసలు ఉసిరిని తేనెలో నానబెట్టి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

తేనెలో నానబెట్టిన ఉసిరికాయను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలలో రోగనిరోధక శక్తిని పెంచే ప్రభావం ఒకటి. ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇదొక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. తేనెలో యాంటీ మైక్రోబయల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఈ మిశ్రమం అంటువ్యాధులు, వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. 
 

38

యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి

ఉసిరి, తేనె రెండూ యాంటీఆక్సిడెంట్లకు గొప్ప వనరులు,. ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ఆక్సీకరణ ఒత్తిడి, మంటను కలిగిస్తాయి. ఇది ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. తేనెలో నానబెట్టిన ఉసిరిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ ఫ్రీ రాడికల్స్ ను తటస్తం చేయడానికి, అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గించడానికి, మొత్తం శ్రేయస్సును ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.

48
digestion

digestion

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ఉసిరికాయ జీర్ణ ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది. ఇది మంచి జీర్ణక్రియ, పోషక శోషణకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉసిరిని తేనెతో తినడం వల్ల జీర్ణ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. గట్ ను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

58

గుండె ఆరోగ్యానికి మద్దతు 

ఉసిరి, తేనె కాంబినేషన్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉసిరిలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు తేనెను మితంగా తీసుకోవడం గుండెకు మంచి మేలు జరుగుతుంది. 
 

68

చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది

ఉసిరి, తేనె రెండూ కలిపినప్పుడు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఉసిరికాయలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ సంశ్లేషణకు సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. తేనె సహజ మాయిశ్చరైజింగ్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. వివిధ చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. 
 

78

బరువు తగ్గడానికి 

బరువు తగ్గడానికి  ప్రయత్నించేవారికి తేనెలో నానబెట్టిన ఉసిరి మంచి మేలు చేస్తుంది. ఉసిరికాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కడుపును తొందరగా నింపుతుంది. అలాగే అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. 
 

88

శ్వాసకోశ ఆరోగ్యానికి మద్దతు

ఉసిరికాయలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తేనె లోని ఔషదగుణాలు కలిసి శ్వాసకోశ ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఈ మిశ్రమం దగ్గు, జలుబు, ఉబ్బసం లక్షణాలు వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి, ఉపశమనం కలిగించడానికి, మొత్తం శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved