Morning Habits: పిల్లలు ఉదయాన్నే ఈ పనులు చేస్తే స్మార్ట్ అవుతారు
Morning Habits: పిల్లలు చిన్నగున్నప్పుడే కొన్ని అలవాట్లను నేర్పితే వారు ఎప్పటికీ మర్చిపోరు. వీటివల్ల పిల్లలు తెలివిగా తయారువుతారు. వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి పిల్లలకు పిల్లలకు ఉండాల్సిన కొన్ని ఉదయపు అలవాట్ల గురించి తెలుసుకుందాం పదండి.

మార్నింగ్ హాబిట్స్
పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల పెంపకంపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి పిల్లల్ని ఎలా పెంచుతున్నామని తల్లిదండ్రులు పరిశీలించుకోవాలి. అయితే పిల్లలకు చిన్నతనంలోనే మంచి అలవాట్లను నేర్పితే వారు జీవితాంతం వాటిని పాటిస్తూనే ఉంటారు. ఇవి వారి ఎదుగుదలకు, ఆరోగ్యానికి సహాయపడతాయి. కాబట్టి పిల్లలకు నేర్పాల్సిన కొన్ని అలవాట్లు, పిల్లలు ఉదయాన్నే చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. వీటిని పాటిస్తే మీ పిల్లలు స్మార్ట్ అవుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
టైంకి నిద్రలేవడం
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూల్ సమయానికే నిద్రలేపుతుంటారు. స్కూల్ లేనిరోజు చాలా లేట్ గా నిద్రలేపుతుంటారు. కానీ ఈ అలవాటు మంచిది కాదు. ఇవి వారికి క్రమశిక్షణ లేకుండా చేస్తుంది. కాబట్టి పిల్లలను ఏ రోజైనా సరే సమయానికే నిద్రలేపడం అవసరం. దీనివల్ల వారికి డిసిప్లైన్ ఉంటుంది. క్రమశిక్షణలో ఉంటారు. అంతేకాదు ఉదయాన్నే నిద్రలేవడం వల్ల పిల్లల జీవగడియారం కూడా సమతుల్యంగా ఉంటుంది.
బాధ్యతలు
పిల్లలకు ఉదయాన్నే చిన్న చిన్న బాధ్యతలను అప్పజెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. ఇది వారిలో బాధ్మతాయుత భావాన్ని పెంచుతుంది. అలాగే సమస్యల నుంచి పారిపోకుండా చేస్తుంది.
వ్యాయామం, ధ్యానం
యోగా, వ్యాయామం పిల్లల్ని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే ప్రతిరోజూ ఉదయాన్నే ఫ్రెష్ గాలిలో 15 నుంచి 20 నిమిషాలు చిన్నపాటి వ్యాయామం లేదా యోగను చేయించండి. దీనివల్ల పిల్లలు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే వారిలో ఏకాగ్రత కూడా పెరుగుతుంది. అలాగే ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేస్తే పిల్లల మనస్సు ప్రశాంతంగా అవుతుంది. వారిలో సానుకూల ఆలోచనలు వస్తాయి.
ప్రకృతితో కొంత సమయం
ఎప్పుడూ పిల్లల్ని ఇంట్లో ఉంచకండి. ఉదయాన్నే కాసేపు ఎండలో ఉండనివ్వండి. దీనివల్ల పిల్లలకు ఎండతగిలి వారికి అవసరమైన విటమిన్ డి అందుతుంది. దీంతో వారి ఎముకలు బలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మంచి బ్రేక్ ఫాస్ట్
చాలా మంది పిల్లలు స్కూల్ హడావుడిలో పడి బ్రేక్ ఫాస్ట్ ను అస్సలు చేయరు. కానీ ఉదయం తినకపోవడం వల్ల వారి ఆరోగ్యం పాడవుతుంది. అలాగే స్కూల్ లో ఏం చెప్పినా అర్థం చేసుకోలేరు. ఇది వారి చదువును డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి మంచి పోషకాహారాన్ని బ్రేక్ ఫాస్ట్ లో పెట్టండి. ఇది వారి మెదడును షార్ప్ గా ఉంచుతుంది. పిల్లల్ని ఎనర్జిటిక్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే పిల్లలు ఉదయాన్నే ఒక స్ఫూర్తిదాయకమైన కథను వినడం కూడా మంచిదే. ఇది వారి ఎదుగుదలకు సహాయపడుతుంది.
అన్నింటిని సిద్దం చేసుకోవడం
చాలా మంది పేరెంట్స్ పిల్లలు స్కూల్ కు వెళ్లడానికి అవసరమైన యూనిఫాం, బుక్స్, బ్యాగ్, మధ్యాహ్న భోజనం అంటూ అన్నింటినీ పిల్లలకే తీసుకెళ్తారు. కానీ దీనివల్ల మీ పిల్లలు సోమరిగా అవుతారు. కాబట్టి వారికి సంబంధించిన వాటిని వారే ఏర్పాటు చేసుకునేలా నేర్పండి. ఉదయం బుక్స్ సర్దుకోవడం, స్కూల్ యూనిఫాం ను తీసుకోవడం, బ్రేక్ ఫాస్ట్ తినడం వంటివి నేర్పండి. ఇవి చిన్న చిన్న విషయాలే అయినా మీ పిల్లల్ని స్మార్ట్ గా తయారుచేస్తాయి.