MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • గ్రీన్ టీ మాత్రమే కాదు.. గ్రీన్ కాఫీని తాగినా బోలెడు లాభాలున్నాయి..

గ్రీన్ టీ మాత్రమే కాదు.. గ్రీన్ కాఫీని తాగినా బోలెడు లాభాలున్నాయి..

గ్రీన్ టీని మనలో చాలా మంది తాగుతుంటారు. అయితే ఇది మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కానీ గ్రీన్ కాఫీ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా తాగారా? దీన్ని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు తెలుసా?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 04 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి చాలా మంది కాఫీని తరచుగా తాగుతుంటారు. ఎలాంటి సీజన్ అయినా సరే.. కాఫీని మోతాదుకు మించి తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దీనిలో ఉండే కెఫిన్ కంటెంట్ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 
 

26
green coffee

green coffee

అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది టీ, కాఫీలకు బదులుగా గ్రీన్ టీని తాగడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నిజానికి గ్రీన్ టీ టేస్టీగా ఉండటమే కాదు. మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే మనలో చాలా మందికి గ్రీన్ కాఫీ గురించి తెలియదు. ఈ గ్రీన్ కాఫీ కూడా ఎంతో టేస్టీగా ఉండటంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో కెఫిన్ కంటెంట్ అసలే ఉండదు. అందుకే దీన్ని వీలైనంత వరకు తాగొచ్చు. ఈ గ్రీన్ కాఫీ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీన్ని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

36

యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం

గ్రీన్ కాఫీ బీన్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. ఈ కాఫీలో పొటాషియం, సోడియంలు తక్కువగా ఉంటాయి. అందుకే ఇది అధిక రక్తపోటు పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 

46

డయాబెటిస్ రోగులకు ప్రయోజనకరం

గ్రీన్ కాఫీ డయాబెటిస్ పేషెంట్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ నార్మల్ గా ఉంటాయి. ఈ కాఫీని తాగడం వల్ల శరీరంలో మంట కూడా తగ్గుతుంది. మీరు డయాబెటిస్ పేషెంట్ అయితే గ్రీన్ కాఫీని రోజూ తాగండి. 

 

56

శరీరానికి శక్తి

గ్రీన్ కాఫీ ఎనర్జీ బూస్టర్ గా కూడా పనిచేస్తుంది. మీకు అలసటగా అనిపిస్తే గ్రీన్ కాఫీని ఎంచక్కా తాగొచ్చు. ఈ గ్రీన్ కాఫీని తాగడం వల్ల మీ శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. 
 

 

66
green tea

green tea

చెడు కొలెస్ట్రాల్ తగ్గింపు 

ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయిన వారికి కూడా గ్రీన్ కాఫీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ గ్రీన్ కాఫీ బీన్స్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. దీంతో మీ గుండె సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటుంది. మీరు రెగ్యులర్ గా గ్రీన్ కాఫీని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

చర్మానికి మేలు 

గ్రీన్ కాఫీలో కొవ్వు ఆమ్లాలు, రైడిక్ ఆమ్లం, లినోలెయిక్ ఆమ్లం, ఒలేయిక్ ఆమ్లం ఉంటాయి. ఇవి మన చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆహారం
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
అతి సమాచారం ప్రమాదకరం.. 'ఇన్ఫోబేసిటీ' రోగం ఖాయం..!
Recommended image2
అవిసె గింజలు తింటే కలిగే 6 అద్భుతమైన ప్రయోజనాలు ఇవే!
Recommended image3
Pumpkin Seeds: 11 రోజులు క్రమం తప్పకుండా గుమ్మడి గింజలు తింటే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved