పిల్లలకు ఎంతో ఇష్టమైన ఆలూ బెడ్స్ శాండ్విచ్ తయారీ విధానం..
పిల్లలు ఎప్పుడూ తినే రొటీన్ బ్రేక్ ఫాస్ట్ లకు బదులుగా కాస్త వెరైటీగా బ్రేక్ ఫాస్ట్ ను ట్రై చేశామంటే వారు ఎటువంటి పేచీ లేకుండా మొత్తం తినడానికి ఇష్టపడతారు. అయితే పిల్లలకు బ్రెడ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. బ్రెడ్ తో ఎప్పుడూ చేసుకునే శాండ్విచ్ లకు స్వస్తిచెప్పి ఆలూ బ్రెడ్ శాండ్విచ్ (Aloo Bread Sandwich) ని ట్రై చేయండి. దీన్ని మంచి బ్రేక్ ఫాస్ట్ (Breakfast) గా, స్నాక్ గా తినవచ్చు. దీని తయారీ విధానం కూడా చాలా సులభం. ఇది పిల్లలకు ఎంతగానో నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా బ్రెడ్ శాండ్విచ్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు: నాలుగు బ్రెడ్ స్లైసెస్ (Bread slices), రెండు బంగాళాదుంపలు (Potato), ఒక ఉల్లిపాయ (Onion), రెండు పచ్చిమిరపకాయలు (Chillies), రుచికి సరిపడా ఉప్పు (Salt), కొత్తిమీర (Coriyander) తరుగు, సగం టీ స్పూన్ జీలకర్ర పొడి (Cumin powder), సగం టీ స్పూన్ కారం పొడి (Chilli powder), పావు స్పూన్ గరం మసాలా (Garam masala), సగం స్పూన్ నిమ్మరసం (Lemon juice), ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లాక్స్ (Chilli flakes), ఒక టీ స్పూన్ టమోటా కెచప్ (Tomato kitchup), ఒక టీ స్పూన్ మాయొన్నైస్ (Mayonnaise), కొద్దిగా బటర్ (Butter).
తయారీ విధానం: ముందుగా నీటిలో బంగాళదుంపలను (Potato) శుభ్రపరుచుకుని తరువాత ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, కారం పొడి, జీలకర్ర పొడి, గరం మసాల పొడి, నిమ్మరసం, చిల్లీ ఫ్లాక్స్ వేసి బాగా కలుపుకొని (Mix well) పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు రెండు బ్రెడ్ స్లైసెస్ ను తీసుకొని ఒక బ్రెడ్ కి టమోటా కెచప్ అప్లై చేసుకోవాలి. మరొక బ్రెడ్ కి మాయొన్నైస్ అప్లై చేసుకోవాలి. టమోటా కెచప్ అప్లై చేసుకున్న బెడ్ భాగం పైన ఆలూ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకొని దీనిపైన మాయొన్నైస్ (Mayonnaise), అప్లై చేసుకున్నా బ్రెడ్ ను పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా బటర్ (Butter) వేసి వేడి చేసుకోవాలి. బటర్ వేగిన తరువాత ఆలు బ్రెడ్ స్లైసెస్ నుంచి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకూ బ్రెడ్ ను ఫ్రై చేసుకోవాలి.
రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్ లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ బాగానికి మధ్యగా శాండ్విచ్ ఆకారంలో (sandwich shape) కట్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన బ్రెడ్ శాండ్విచ్ రెడీ (Ready). దీన్ని టమోటో కెచప్ తో సర్వ్ చేయండి. ఇకెందుకు ఆలస్యం దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ స్నాక్ ఐటం మీ పిల్లలకు ఎంతగానో నచ్చుతుంది. దీని తయారీ విధానం కూడా చాలా సులభం.