MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • మద్యం తాగితే నిజంగానే చలి తగ్గుతుందా.? ఇందులో నిజ‌మెంతంటే..

మద్యం తాగితే నిజంగానే చలి తగ్గుతుందా.? ఇందులో నిజ‌మెంతంటే..

Alcohol: చ‌లి ప్ర‌భావం మొద‌లైంది. క్ర‌మంగా ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతున్నాయి. చాలా మంది ష్వ‌ట‌ర్లు, మ‌ఫ్ల‌ర్ల‌ను బ‌య‌ట‌కు తీస్తున్నారు. కాగా మ‌ద్యం తాగితే చ‌లి త‌గ్గుతుంద‌ని చాలా మంది భావిస్తారు. మ‌రి ఇందులో నిజ‌మెంతో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Nov 09 2025, 07:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మ‌ద్యం తాగితే వేడి పెరుగుతుందా.?
Image Credit : Generated by google gemini AI

మ‌ద్యం తాగితే వేడి పెరుగుతుందా.?

శీతాకాలం వచ్చేసింది. చలి తట్టుకోలేక, “ఒక్క పెగ్గేస్తే హీటెక్కిపోతుంది” అని చాలామంది అనుకుంటారు. అయితే కాసేపు వేడి అనిపించినా, అది తాత్కాలిక ప్రభావమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మద్యం తాగిన తర్వాత శరీరానికి వేడి అనిపించడమే తప్ప, అసలు ఉష్ణోగ్రత తగ్గిపోతుందని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. మద్యం శరీరంలోని రక్తనాళాలను విస్తరింపజేస్తుంది. దీంతో చర్మ ఉపరితలానికి రక్తప్రసరణ పెరిగి, వేడి అనిపిస్తుంది. కానీ అదే సమయంలో లోపలి అవయవాలకు రక్తప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత (కోర్ టెంపరేచర్) క్రమంగా పడిపోతుంది.

25
మద్యం వల్ల శరీర ఉష్ణోగ్రత ఎలా తగ్గుతుంది?
Image Credit : Getty

మద్యం వల్ల శరీర ఉష్ణోగ్రత ఎలా తగ్గుతుంది?

సాధారణంగా చలి సమయంలో మన శరీరం రక్తనాళాలను సంకోచింపజేసి వేడి బయటకు వెళ్లకుండా కాపాడుతుంది. కానీ మద్యం తాగితే ఈ సహజ రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది. రక్తనాళాలు విస్తరించడం వల్ల చర్మం మీద వేడి పెరిగి బయటకు పోతుంది. ఫలితంగా లోపలి అవయవాలు చల్లబడతాయి. శరీర ఉష్ణోగ్రత 35 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతే దాన్ని అల్పోష్ణస్థితి (Hypothermia) అంటారు. ఈ పరిస్థితిలో తల తిరగడం, మతిమరుపు, స్పష్టంగా మాట్లాడలేకపోవడం, శరీరం వణకడం వంటి లక్షణాలు కనబడతాయి. తీవ్రమైన పరిస్థితుల్లో ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది.

Related Articles

Related image1
ఒకే గ‌దిలో అమ్మాయి, అబ్బాయి.. ఇష్టారాజ్యంగా ఉండొచ్చు. హైద‌రాబాద్‌లో పెరుగుతోన్న‌ కో లివింగ్ క‌ల్చ‌ర్‌
Related image2
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు హైద‌రాబాద్‌లాంటి సిటీలు.. రూ. లక్ష కోట్ల పెట్టుబ‌డులు, 85 వేల ఉద్యోగాలు
35
“వెచ్చదనం” కాదు, మరింత ప్రమాదం
Image Credit : Pixabay

“వెచ్చదనం” కాదు, మరింత ప్రమాదం

మద్యం తాగిన తర్వాత ఒళ్లు వెచ్చబడ్డట్టనిపించడం నిజ‌మైన‌ అనుభూతి కాద‌ని నిపుణులు అంటున్నారు. అది కేవలం రక్తనాళాల విస్తరణ వల్ల వచ్చే తాత్కాలిక ప్రభావం మాత్రమే.

నిజానికి చ‌లిలో ఆల్కహాల్ తాగడం వల్ల..

* శరీరంలో వేడి త్వరగా బయటకు వెళ్తుంది.

* రక్తపోటు తగ్గుతుంది, గుండె స్పందన రేటు మారుతుంది.

* శరీరానికి సహజంగా వచ్చే వణుకు ప్రతిస్పందన (Shivering Response) అణిచిపోతుంది.

* దీని వల్ల శరీరం చలికి మరింత బలహీనంగా మారుతుంది.

ఇది ముఖ్యంగా గుండెజబ్బులు ఉన్నవారికి తీవ్రమైన ప్రమాదం. శరీర ఉష్ణోగ్రత వేగంగా పడిపోవడం గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

45
డీహైడ్రేషన్ మ‌రో పెద్ద స‌మ‌స్య
Image Credit : Getty

డీహైడ్రేషన్ మ‌రో పెద్ద స‌మ‌స్య

ఆల్కహాల్ ఒక మూత్రవిసర్జన కారకం (Diuretic). అంటే మద్యం తాగిన తర్వాత మూత్ర విసర్జన ఎక్కువగా జరుగుతుంది. శీతాకాలంలో మనం సాధారణంగా తక్కువ నీరు తాగుతాం కాబట్టి, డీహైడ్రేషన్ స‌మ‌స్య పెరుగుతుంది. శరీరంలో తేమ తగ్గిపోవడంతో ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యం తగ్గుతుంది. ఇది చలిని మరింత పెంచుతుంది. అదనంగా, డీహైడ్రేషన్ వల్ల చర్మం పొడిబారడం, రక్తప్రసరణ మందగించడం, తలనొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయి.

55
చ‌లిని త‌ట్టుకోవ‌డానికి స‌రైన మార్గాలు ఇవే..
Image Credit : Getty

చ‌లిని త‌ట్టుకోవ‌డానికి స‌రైన మార్గాలు ఇవే..

చలిని తగ్గించుకోవడానికి మద్యం తాగడం ప్రమాదకరం. దీనికి బదులుగా నిపుణులు సూచించే సురక్షిత మార్గాలు ఇవి.

* ఉన్నిదుస్తులు, మఫ్లర్లు, గ్లౌవ్స్ ధరించడం

* సూప్, టీ, హాట్ వాటర్, విటమిన్ C పండ్లు తీసుకోవడం

* గది లోపల వేడి వాతావరణం కల్పించడం

* చర్మానికి మాయిశ్చరైజర్‌లు ఉపయోగించడం

* వృద్ధులు, పిల్లలు రాత్రివేళ బయటకు వెళ్లకూడదు

చలిలో మద్యం తాగడం తాత్కాలికంగా సౌకర్యంగా అనిపించినా, దాని ప్రభావం శరీరంపై ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి చలి నుంచి రక్షణకు “పెగ్గు” కాదు, ప్రమాదం తప్పించుకోవడమే నిజమైన జాగ్రత్త.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Fatty Liver: సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఫ్యాటీ లివర్ ముప్పు..కారణమిదే..
Recommended image2
Vitamin B12: వెజిటేరియన్స్ ఈ 5 ఫుడ్స్ తో B12 లోపానికి చెక్ పెట్టొచ్చు
Recommended image3
Dates Benefits: రోజుకు రెండు ఖర్జూరాలు తింటే కలిగే 7 లాభాలు ఇవే!
Related Stories
Recommended image1
ఒకే గ‌దిలో అమ్మాయి, అబ్బాయి.. ఇష్టారాజ్యంగా ఉండొచ్చు. హైద‌రాబాద్‌లో పెరుగుతోన్న‌ కో లివింగ్ క‌ల్చ‌ర్‌
Recommended image2
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు హైద‌రాబాద్‌లాంటి సిటీలు.. రూ. లక్ష కోట్ల పెట్టుబ‌డులు, 85 వేల ఉద్యోగాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved