90 శాతం మందికి విస్కీ తాగడం ఎలాగో తెలియదు.. మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా.?
Whisky: మద్యం ప్రియులు విస్కీని ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. ఇదొక క్లాసిక్ డ్రింక్. అయితే చాలామంది దీన్ని ఎలా సరిగ్గా తాగాలో తెలియక రుచిని, అనుభూతిని కోల్పోతుంటారు. ఒక పెగ్‌ను పర్ఫెక్ట్‌గా ఆస్వాదించాలంటే కొన్ని సింపుల్ నియమాలు పాటించాలి. అవేంటంటే..

ఏ గ్లాస్‌లో తాగుతున్నాము.?
విస్కీని ఏ గ్లాస్‌లో సర్వ్ చేస్తారో అదే దాని ఫ్లేవర్‌పై ప్రభావం చూపుతుంది. రాక్ గ్లాస్ లేదా టంబ్లర్ గ్లాస్‌లో సర్వ్ చేయడం ఉత్తమం. ఇవి విస్కీ సువాసనను కాపాడుతూ, తాగేటప్పుడు పూర్తి రుచి అందించేలా చేస్తాయి. చాలా మంది ప్లాస్టిక్ గ్లాస్‌లలో విస్కీ తాగుతుంటారు. అయితే ఇది విస్కీ అసలు వాసనను తగ్గిస్తుంది.
ఐస్‌ను ఎలా వాడాలో తెలుసుకోండి
విస్కీని కొద్దిగా చల్లబరచడం మంచి ఆలోచనే కానీ ఎక్కువ ఐస్ వేస్తే పానీయం నీళ్లలా అయిపోతుంది. చిన్న క్యూబ్స్ కంటే పెద్ద ఐస్ క్యూబ్స్ లేదా విస్కీ స్టోన్స్ వాడితే చల్లదనాన్ని కాపాడుతూనే రుచిని చెడగొట్టవు. విస్కీ తాగడంలో “బాలెన్స్” చాలా ముఖ్యం.
నీళ్లు ఎన్ని కలపాలి.?
చాలామంది విస్కీలో నీరు కలపడం దాని రుచిని చెడగొడుతుందని అనుకుంటారు. కానీ కొంచెం నీరు కలపడం వల్ల విస్కీలో దాగి ఉన్న ఫ్లేవర్లు బయటకు వస్తాయి. మొత్తం నీరు కలపకుండా తాగడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే మరీ ఎక్కువ కూల్‌గా కాకుండా మీడియంగా తీసుకోవాలి. అలాగే మరీ ఎక్కువ నీరు పోసుకున్నా విస్కీ రుచి తగ్గుతుంది.
బాటిల్ తెరవగానే తాగకండి
విస్కీ బాటిల్ తెరిచిన వెంటనే గ్లాస్‌లో పోసి తాగేయడం చాలా మందికి అలవాటు. కానీ ఉత్తమ అనుభూతి కోసం 1-2 నిమిషాలు దానిని గాలిలో ఉంచండి. అప్పుడు దాని సువాసన పూర్తిగా వెలువడుతుంది. వైన్‌కి ఎలా గాలి అవసరమో, విస్కీకి కూడా అలాగే ఉంటుంది.
పరిమితి తెలుసుకోవడం కూడా ముఖ్యమే..
“పర్ఫెక్ట్ పెగ్” అంటే ఎక్కువ తాగడమో తక్కువ తాగడమో కాదు.. సరైన పరిమాణంలో తాగడం. సాధారణంగా 30 ml నుండి 60 ml వరకు సరిపోతుంది. దానిని మించి తాగితే రుచి పక్కన పెడితే.. తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. నాణ్యమైన విస్కీతో, సరైన గ్లాస్‌లో, సరైన మోతాదులో తాగితేనే అది అసలు ఆనందం ఇస్తుంది. అలాగనీ ఇష్టారాజ్యంగా తాగితే ఆరోగ్యం పాడవుతుంది.