Health Tips: వెజైనల్ డిశ్చార్జ్ కి కారణాలేమిటి.. ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి!
Health Tips: వెజైనల్ డిస్చార్జ్ అనేది ప్రతి మహిళకి సాధారణమైన విషయమే అయితే ఒక స్థాయిని మించి వెజైనల్ డిశ్చార్జ్ అయితే కనుక డాక్టర్ని సంప్రదించాలి. అసలు ఈ వెజైనల్ డిస్చార్జ్ ఎందుకు వస్తుంది.. ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ తెల్లబట్ట అనేది తక్కువ ప్రమాణంలో ఉన్నట్లయితే దానిని పెద్దగా పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదు. అయితే మోతాదుని మించి వైట్ డిస్చార్జ్ అయితే మాత్రం కచ్చితంగా డాక్టర్ని సంప్రదించవలసిన అవసరం ఉంటుంది.అసలు ఈ వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది..
అన్నప్పుడు చాలా కారణాలు కనిపిస్తాయి. అవి ఏమిటో చూద్దాం. కొంతమంది స్త్రీలకు సువాసన గల సబ్బులు, స్ప్రేలు, అలాగే క్లీనింగ్ లిక్విడ్స్ ఎలర్జీ ఉంటుంది. ఈ ఎలర్జీ ఇన్ఫెక్షన్ కి కారణం అవుతుంది. తద్వారా వైట్ డిస్చార్జ్ పెద్ద మొత్తంలో ఉంటుంది. అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ బారిన పడిన స్త్రీలు..
వారి యొక్క వైట్ డిస్చార్జిలో దుర్గంగాన్ని కలిగి ఉండవచ్చు. అలాగే అధిక మోతాదులో కూడా వైట్ డిస్చార్జ్ ఉంటుంది. అలాగే శరీరంలో ఈస్ట్ పెరుగుదల మరియు ఇన్ఫెక్షన్ వల్ల కూడా జరుగుతుంది. మహిళలు ఎక్కువ సారవంతమైన గుడ్లను ఉత్పత్తి చేసే కాలంలో ప్రతినెల..
భారీ వైట్ డిశ్చార్జ్ ను అనుభవించవచ్చు. ఈ కాలం సంతాన ఉత్పత్తికి అనువైన కాలంగా చెప్పుకోవచ్చు. ఎస్ టి డి లు సోకిన వారితో అసురక్షిత సంభోగం వల్ల కూడా స్త్రీలు ఎస్ బి ఐలను పొందవచ్చు.
దీనితో తెల్లదనం పెరుగుతుంది. ఆ ప్రాంతంలో దురద మరియు చికాకు కూడా ఏర్పడుతుంది. దీనివలన ఒకలాంటి దుర్వాసన కూడా వస్తుంది. వీటిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. కచ్చితంగా డాక్టర్ని సంప్రదించడం వలన ఆరోగ్యానికి స్వస్థత చేకూరుతుంది.