MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Health
  • Pomegranate:వారం రోజులు దానిమ్మ జ్యూస్ తాగితే ఇన్ని లాభాలా? బాడీని రీఛార్జ్ చేసే సూపర్ టిప్స్

Pomegranate:వారం రోజులు దానిమ్మ జ్యూస్ తాగితే ఇన్ని లాభాలా? బాడీని రీఛార్జ్ చేసే సూపర్ టిప్స్

Pomegranate:వరుసగా వారం రోజుల పాటు ప్రతిరోజూ ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఆశ్చర్యకరమైన మార్పులు వస్తాయి. దానిమ్మను "సూపర్ ఫుడ్" అని పిలవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 

2 Min read
Author : Nandini Arava
Published : Mar 21 2026, 07:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఫ్రూట్‍
Image Credit : Getty

ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఫ్రూట్‍

ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఫ్రూట్‍లో దానిమ్మ ఒకటి. దీనిని గింజల రూపంలో కంటే జ్యూస్‌గా తీసుకుంటే శరీరానికి పోషకాలు త్వరగా అందుతాయి. అయితే, చాలామంది దీనిని అప్పుడప్పుడు తాగుతుంటారు. కానీ, మీరు ఎప్పుడైనా వరుసగా వారం రోజుల పాటు ప్రతిరోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తాగి చూశారా? కేవలం ఏడు రోజుల్లోనే మీ రక్త ప్రసరణ నుంచి ముఖ వర్ఛస్సు వరకు..శరీరంలో మీరు ఊహించని విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు ఆ 7 రోజుల్లో మీ బాడీలో ఏం జరుగుతుంది? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
1. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది
Image Credit : Getty

1. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది

దానిమ్మలో ఉండే 'నైట్రేట్లు' రక్త నాళాలను వ్యాకోచించేలాచేస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. వారం రోజుల తర్వాత మీరు మునుపటి కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

37
2.మెరిసే చర్మం (Glowing Skin)
Image Credit : Getty

2.మెరిసే చర్మం (Glowing Skin)

దానిమ్మలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ కణాలను యాక్టివేట్ చేస్తాయి. వారం రోజుల్లో మీ ముఖంలో సహజమైన మెరుపు రావడం, మొటిమల మచ్చలు తగ్గినట్లు కనిపిస్తుంది. 

47
3. గుండె ఆరోగ్యం
Image Credit : Getty

3. గుండె ఆరోగ్యం

ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తపోటు (BP) ఉన్నవారికి ఇది ఒక వరం లాంటిది. ఇది ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా కాపాడుతుంది.

57
4.రోగనిరోధక శక్తి పెరుగుదల
Image Credit : our own

4.రోగనిరోధక శక్తి పెరుగుదల

దానిమ్మలో విటమిన్-C, విటమిన్-E పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఇమ్యూనిటీని పెంచి, వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి.

67
5. జీర్ణక్రియ మెరుగుపడుతుంది
Image Credit : Getty

5. జీర్ణక్రియ మెరుగుపడుతుంది

రోజూ దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల పొట్టలోని మంట (Inflammation) తగ్గుతుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరిచి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. 

77
హెల్తీగా దానిమ్మ జ్యూస్ ఇలా చేసుకోవాలి
Image Credit : Getty

హెల్తీగా దానిమ్మ జ్యూస్ ఇలా చేసుకోవాలి

ముందుగా దానిమ్మ గింజలను శుభ్రంగా కడిగి మిక్సీలో వేయండి. అందులో పుదీనా ఆకులు వేసి కేవలం 10-15 సెకన్లు మాత్రమే బ్లెండ్ చేయండి. ఎక్కువ సేపు మిక్సీ పడితే గింజల లోపల ఉండే తెల్లటి భాగం నలిగి జ్యూస్ చేదుగా మారుతుంది. స్ట్రైనర్ సహాయంతో రసాన్ని వడకట్టండి. ఇప్పుడు ఈ రసంలో నిమ్మరసం, చిటికెడు నల్ల ఉప్ లేదా తేనె కలపండి, టేస్టీగా ఉంటుంది. ఐస్ క్యూబ్స్ లేకుండా తాజాగానే తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.దానిమ్మలో సహజంగానే తీపి ఉంటుంది, కాబట్టి వైట్ షుగర్ అస్సలు వాడకండి.జ్యూస్ తీసిన 10-15 నిమిషాల్లోపు తాగేయాలి. నిల్వ ఉంచితే దానిలోని పోషక విలువలు తగ్గుతాయి.ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో లేదా వ్యాయామం చేసిన తర్వాత తాగితే ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు కిడ్నీ సమస్యలు ఉన్నా లేదా డయాబెటిస్ మందులు వాడుతున్నా ఒకసారి డాక్టర్‍ను సంప్రదించడం మంచిది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Related Stories
Recommended image1
Pomegranate : తొక్కే కదా అని పారేయకండి.. దానిమ్మ తొక్కతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో!
Recommended image2
Pomegranate Peel: దానిమ్మ తొక్కను ఇలా వాడితే ఎన్ని లాభాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved