రోజూ రెండు లవంగాలను తీసుకుంటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?
మన వంటింటి మసాల దినుసులలో అందరికీ అందుబాటులో ఉండే లవంగాలు (Cloves) శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలగజేస్తాయి. మొగ్గ ఆకారంలో ఉండే ఈ లవంగాలు ఎన్నో ఔషధ గుణాలను (Medicinal properties) కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని అనేక రోగాలను నయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. నిత్యం రెండు లవంగాలను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ లవంగాలు శరీరానికి ఏ విధమైన ఆరోగ్యప్రయోజనాలను కలుగజేస్తాయో ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..

రోజూ లవంగాలను తీసుకుంటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) కలుగుతాయి. లవంగాలు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలతో నిండి ఉంటుంది. ఇవి శరీరానికి రోగాలతో పోరాడే శక్తిని అందిస్తాయి. లవంగాలు శరీరానికి మంచి ఎనర్జీ బూస్టర్ (Energy booster) గా సహాయపడతాయి. రోజూ రెండు లవంగాలను నమిలి తింటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: లవంగాల పొడిని (Cloves powder) తేనెతో (Honey) కలిపి తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయి. లవంగాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగించి జీర్ణ ఎంజైమ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో తిన్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. పేగుల్లో పేరుకుపోయిన మలాన్ని తేలిక పరచిన మలబద్దకం సమస్యలు తగ్గిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: లవంగాలు శరీరంలోని తెల్ల రక్త కణాల (White blood cells) సంఖ్యను పెంచడానికి సహాయపడతాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడగల సామర్థ్యాన్ని శరీరానికి అందిస్తాయి. ఇది శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని అందించి రోగనిరోధక శక్తిని (Immunity) పెంచుతాయి.
పంటి నొప్పిని తగ్గిస్తుంది: లవంగాలలో ఉండే అనాల్జేసిక్ లక్షణాలు (Analgesic properties) తీవ్రమైన పంటి నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. పంటి నొప్పి (Toothache) ఉన్న ప్రదేశంలో లవంగాల పొడిని అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తే పంటి నొప్పి సమస్యలు తగ్గుతాయి.
కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: రోజు రెండు లవంగాలను నమిలి తింటే కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలోని మలిన పదార్థాలను బయటకు పంపడానికి లవంగాలు చక్కగా పనిచేస్తాయి. లవంగాలలో ఉండే ఔషధ గుణాలు (Medicinal properties) కాలేయం (Liver) ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
దుర్వాసనను నివారిస్తుంది: లవంగాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ (Antibacterial) లక్షణాలు నోటి దుర్వాసనను తగ్గించడానికి సహాయపడుతాయి. రోజూ రెండు లవంగాలను నమిలి తింటే నోటిలోని బ్యాక్టీరియా నశించి నోటి దుర్వాసన సమస్యలు (Bad breath problems) తగ్గుతాయి.
తలనొప్పిని తగ్గిస్తుంది: కొబ్బరినూనెలో లవంగాలను నానబెట్టి ఆ నూనెను నుదుటిపై మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే తల నొప్పి (Headache) నుంచి విముక్తి కలుగుతుంది. లవంగాలలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ (Anti-inflammatory) లక్షణాలు తలనొప్పిని తగ్గించడానికి చక్కగా సహాయపడతాయి.