MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఈ కూరలను వేడి చేస్తే విషమవుతాయి.. పొరపాటున తిన్నారంటే?

ఈ కూరలను వేడి చేస్తే విషమవుతాయి.. పొరపాటున తిన్నారంటే?

మనలో చాలా మందికి ఒకసారి వండిన ఆహారాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తినే అలవాటు ఉంటుంది. కానీ కొన్ని ఆహారాలను మళ్లీ వేడి చేస్తే విషంలా మారుతాయి. అవేంటంటే? 

2 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Oct 23 2024, 04:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఓవర్ కుకింగ్

ఓవర్ కుకింగ్

మనం తినే ఆహారమే మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. కానీ మనం హెల్తీ ఫుడ్ నే తిన్నా అవి మన ఆరోగ్యాన్ని పాడు చేయొచ్చు. అది కూడా వాటిని మళ్లీ వేడి చేసి తింటే. 

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం వాటిని ఎలా తింటున్నాం? ఎలా వండుతున్నాం? అనే దానిపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. తప్పుడు ఆహారపు అలవాట్లు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడేస్తాయి. వీటిలో ఆహారాలను పదే పదే వేడి చేసి తినడం ఒకటి. ఇలా తినడం వల్ల మీకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఓవర్ కుకింగ్

ఓవర్ కుకింగ్

సాధారణంగా అప్పుడే వండిన ఆహారాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ కొంతమంది ఉదయం వండిన ఆహారాలను రాత్రి వరకు తింటారు. అలాగే రాత్రిపూట వాటిని మళ్లీ వేడి చేసుకుని తింటుంటారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

అలాగే వంటను ఎక్కువ సేపు చేయడం కూడా మంచిది కాదు. అంటే ఎక్కువగా ఉడికించకూడదు. ముఖ్యంగా కొన్ని ఆహారాలను ఎక్కువగా ఉడికిస్తే వాటిలో ఉండే పోషకాలు తగ్గి మన శరీరానికి హాని చేస్తాయి. దీనివల్ల మీకు  క్యాన్సర్ కూడా రావొచ్చు. అందుకే వేటిని మళ్లీ వేడి చేసి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

 

34
వేడిచేయకూడని 5 ఆహారాలు

వేడిచేయకూడని 5 ఆహారాలు

మళ్లీ మళ్లీ వేడి చేసి తినకూడని 5 ఆహారాలు:

బంగాళదుంప

చాలా మంది ఆలుగడ్డ కూరను చాలా ఇష్టంగా తింటుంటారు. అందుకే వారానికి రెండు మూడు సార్లైనా చాలా మంది ఇండ్లలో ఆలుగడ్డ కూర ఉంటుంది. కానీ ఆలుగడ్డ కూరను మళ్లీ వేడి చేసి తినకూడదు. ఎందుకంటే బంగాళదుంపలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల దీన్ని ఎక్కువసేపు వండడం వల్ల అందులో అక్రిలామైడ్ ఏర్పడుతుంది. ఇది క్యాన్సర్ కు కారణమవుతుంది. అందుకే బంగాళా దుంప కూరను మళ్లీ వేడి చేయకూడదు. ఎక్కువ సేపు ఉడికించకూడదు. 

ప్రాసెస్ చేసిన మాంసం

ప్రాసెస్ చేసిన మాంసం చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే ఇవి ఎక్కువ పడితే అక్కడ దొరుకుతున్నాయి. అయితే ఈ మాంసం పాడవకుండా ఉండటానికి దీనిలో కెమికల్స్ ను వాడతారు. ఒకవేళ మీరు వీటిని వేడి చేసి తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. 

 

 

 

44
వేడిచేయకూడని ఆహారాలు

వేడిచేయకూడని ఆహారాలు

చేపలు

చేపల కూరను కూడా మళ్లీ మళ్లీ వేడి చేసి తినకూడదు. చాలా మంది చేపల కూరను చాలా ఇష్టంగా తింటారు. అందుకే ఒకేసారి చాలా మొత్తంలో వండేసి తర్వాతి పూటకు వేడి చేసి తింటుంటారు. కానీ చేపల కూరను వేడి చేసి అస్సలు తినకూడదు.

చేపల్లో ప్రోటీన్లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెండుగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. చేపలను తింటే కళ్లు బాగా కనిపిస్తాయి. కానీ చేపల కూరను మళ్లీ మళ్లీ వేడి చేస్తే దాంట్లో ఉండే పోషకాలు లేకుండా పోతాయి. అలాగే ఈ కూర మీ శరీరానికి హాని చేస్తుంది. అందుకే చేపల కూరను చేసినప్పుడు దాన్ని మళ్లీ మళ్లీ వేడి చేయకుండా ఉండండి. 

వైట్ బ్రెడ్

వైట్ బ్రెడ్ ను మళ్లీ మళ్లీ వేడి చేసి తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఈ బ్రెడ్ లో కార్బోహైడ్రేట్లు, చక్కెర ఎక్కువగా ఉంటాయి. వీటిని వేడి చేస్తే వాటిలో అక్రిలామైడ్ ఏర్పడుతుంది. ఇది క్యాన్సర్ కు కారణమవుతుంది. 

వంట నూనె

వంటనూనెను అస్సలు మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు. ఒక్కసారి ఉపయోగించిన నూనెను మళ్లీ వాడకూడదు. కానీ చాలా మంది డీప్ ఫ్రై చేసిన నూనెను తిరిగి కూరలకు, ఇతర వంటకు ఉపయోగిస్తుంటారు. కానీ నూనెను మళ్లీ మళ్లీ వేడి చేస్తే దాంట్లో హానికరమైన రసాయనాలు ఏర్పడతాయి. ఇవి మనకు క్యాన్సర్ వచ్చే రిస్క్ ను పెంచుతాయి. 

 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జీవనశైలి
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Recommended image2
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Recommended image3
సిగరెట్ లేకుండా మల విసర్జన కావడం లేదా? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved