చర్మ సౌందర్యాన్ని పెంచే 5 బెస్ట్ ఫేషియల్ మసాజ్ క్రీమ్స్ ఇవే!
ప్రస్తుత కాలంలో అందరిలోనూ చర్మ సమస్యలు (Skin problems) సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ చర్మ సమస్యల కారణంగా నలుగురిలో కలవడానికి ఇబ్బందిపడుతుంటారు. అందమైన ముఖ సౌందర్యం కోసం అనేక ప్రయత్నాలు చేసి విసుగు చెందుతుంటారు. అనేక వేల రూపాయలు ఖర్చుపెట్టి బయట మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రాడక్ట్ లను ఉపయోగిస్తున్న సరైన ఫలితం లభించక నిరాశ చెందుతుంటారు.

అయితే బాడీ మసాజ్ లాగే ముఖ సౌందర్యాన్ని పెంచడానికి ఫేషియల్ మసాజ్ (Facial massage) లు కూడా తప్పనిసరి అని సౌందర్యనిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇంట్లోనే సహజసిద్ధమైన ఫేస్ మసాజ్ క్రీమ్స్ లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
ఆరోగ్యవంతమైన మెరుగైన చర్మ సౌందర్యం (Skin beauty) కోసం ఫేషియల్ మసాజ్ క్రీమ్స్ మంచి ఫలితాన్ని అందిస్తాయి. ఫేషియల్ మసాజ్ చర్మ రక్త ప్రసరణ (Blood circulation) మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వయసు పైబడటంతో వచ్చే చర్మ సమస్యలను, ముడతలను, మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యలను శాశ్వతంగా తగ్గించడానికి ఈ ఫేషియల్ మసాజ్ లు తప్పనిసరి. ఇవి చర్మంలో వృద్ధాప్య ఛాయలను తగ్గించి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. చర్మ సంరక్షణ మెరుగుపరుస్తాయి. ఇప్పుడు ఈ ఫేషియల్ మసాజ్ ల గురించి తెలుసుకుందాం..
గ్లిజరిన్, రోజ్ వాటర్, కొబ్బరి నూనె, బాదం ఆయిల్ క్రీమ్: ఈ ఫేషియల్ మసాజ్ కోసం ఒక గిన్నెలో కొబ్బరి నూనె (Coconut oil), బాదం నూనెను (Almond oil) తీసుకుని స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేయాలి. నూనె చల్లారాక ఇందులో రోజ్ వాటర్ (Rose water), గ్లిజరిన్ (Glycerin) వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇలా తయారుచేసుకున్న ఫేషియల్ మసాజ్ క్రీమ్ ను ఒక డబ్బాలో నిల్వచేసుకోవాలి. ఈ క్రీమ్ ను ముఖానికి అప్లై చేసి చేతి వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ ఫేషియల్ మసాజ్ చర్మానికి తగినంత తేమను అందించి చర్మాన్ని ఆరోగ్యంగా (Skin health) ఉంచుతుంది. చర్మం టైట్ గా ఉండేటట్టు చేస్తుంది. వృద్ధాప్య ఛాయలను (Aging shades) తగ్గిస్తుంది.
అవొకాడో, పెరుగు క్రీమ్: అవోకాడోలో విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఈ ఫేషియల్ క్రీమ్ తయారీ కోసం ఒక కప్పులో అవోకాడో పేస్టు (Avocado paste), పెరుగు (Curd) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా చేసుకున్న ఫేషియల్ క్రీములు ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం (Good result) ఉంటుంది. ఇది యాంటీఏజింగ్ మసాజ్ క్రీమ్ (Antiaging massage cream) గా పనిచేస్తుంది.
మిక్క్ క్రీమ్, రోజ్ వాటర్, ఆలివ్ ఆయిల్, గ్లిజరిన్ క్రీమ్: ఒక కప్పులో మిల్క్ క్రీమ్ (Milk cream), రోజ్ వాటర్ (Rose water), ఆలివ్ ఆయిల్ (Olive oil), గ్లిజరిన్ (Glycerin) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఫేషియల్ క్రీమ్ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి.
ఈ ఫేషియల్ మసాజ్ చర్మానికి మంచి మాయిశ్చరైజర్ (Moisturizer) గా పనిచేస్తుంది. మిల్క్ క్రీమ్ లో పుష్కలంగా ఉండే క్లీన్సింగ్, న్యూరిషింగ్ లక్షణాలు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి చర్మ సమస్యలను (Skin problems) దూరం చేస్తుంది.