100 ఏండ్లకు పైగా బతికిన వారి ఉదయపు అలవాట్లు ఇవి..!
ఇప్పుడైతే 50, 60 ఏండ్లకే ఏదో ఒక అనారోగ్యంతో చనిపోతున్నారు కానీ ఒకప్పుడు మన తాతలు, ముత్తాతలు మాత్రం వందేండ్లకు పైగానే బతికారు. అదికూడా ఏ రోగం లేకుండా.

20 నుంచి 30 ఏండ్ల వారికే ఎక్కడలేని రోగాలొస్తున్నాయి ప్రస్తుతం. ఈ రోగాల భయంతోనే జీవితాన్ని ఆస్వాధించని వారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది కానీ.. ఒకప్పుడు మాత్రం ఎలాంటి రోగాలు లేకుండా ఖచ్చితంగా వందేండ్లకు పైగానే బతికారు. ఇప్పుడు కూడా ఇలాంటి వారున్నారు. కానీ నూటిలో ఏ ఒక్కరో, ఇద్దరో ఉన్నారు. అసలు 100 ఏండ్లకు పైగా బతికేవారు ఉదయం కొన్ని అలవాట్లను పాటిస్తారట. అందుకే వారు ఎక్కువ రోజులు బతుకుతారని పరిశోధకులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
healthy lifestyle
లాంగివిటీ హాట్ స్పాట్ లు లేదా బ్లూ జోన్స్ (ఇకారియా, గ్రీస్) పై పరిశోధనకు మార్గదర్శకత్వం వహించిన రచయిత, అన్వేషకుడు డాన్ బ్యూట్నర్ పరిశోధన ద్వారా ఈ అలవాట్ల గురించి వెళ్లడించారు. నిజానికి ఈ అలవాట్లు చాలా సింపుల్ గా ఉంటాయి. ఎక్కువ రోజులు బతకడానికి ఉదయం ఎలాంటి అలవాట్లను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty
మీ 'ఇకిగై'ని కనుక్కోండి
ఇకిగై అనేది ఒక జపనీస్ కాన్సెప్ట్. బ్లూ జోన్స్ ప్రకారం.. మీ ఇకిగైని తెలుసుకోవడం లేదా దానిని కనుక్కుని ప్రయాణం మిమ్మల్ని ఎక్కువ రోజులు బతికేలా చేయడంతో ముడిపడి ఉంటుంది. దీనిలో మీరు ఉదయం నిద్రలేవడానికి ఒక కారణాన్నిఇస్తుంది. ఇకిగై అంటే జీవితంలో ఒక ఉద్దేశ్యాన్ని కలిగి ఉండటం. ఇకిగై ని అనుభూతి చెందడమంటే సాధారణంగా ప్రజలు తమ అభిరుచులను అనుసరించినప్పుడు సంతృప్తిని, సాఫల్యాన్ని పొందడమని అర్థం వస్తుంది. దీనిలో బలవంతంగా ఏదీ చేయరు. ఇష్టాపూర్వకంగా ఉంటాయి. మీరు మీ ఇకిగైని కనుగొన్న తర్వాత మీ రోజువారీ హడావిడిలో చిక్కుకోకుండా ఉంటారు.
Image: Getty
హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయొద్దు
ఆరోగ్యకరమైన ఆహారాలను ఉదయం ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే మనం ఉదయం తినే ఆహారమే మనకు రోజుకు కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఎనర్జిటిక్ గా, ఉత్సాహంగా ఉంచుతుంది. కాలిఫోర్నియాలోని లోమా లిండాలో నివసిస్తున్న 105 ఏళ్ల వృద్ధురాలి రహస్యాన్ని డాన్ బ్యూట్నర్ పంచుకున్నారు. ఆమె చాలా స్లోగా వండిన ఓట్మీల్ తోనే తన డేను స్టార్ట్ చేస్తారట. ఆమె ఫైబర్ పుష్కలంగా ఉండే ఖర్జూరాలు, ఆరోగ్యకరమైన వాల్ నట్స్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా పాలను కూడా తాగుతారట. అంతేకాదు ఆమె prune juice shooter ను అనుసరిస్తారట. ఇది అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుందని వెల్ + గుడ్ నివేదించింది.
Image: Freepik
ఒక కప్పు కాఫీ
బ్లూ జోన్లలోని వ్యక్తుల అలవాట్లను పరిగణనలోకి తీసుకుంటే.. ఉదయపు ఒక కప్పు కాఫీ మీరు ఎక్కువ కాలం బతకడానికి సహాయపడుతుంది. టీ కూడా బాగా పనిచేస్తుంది. ఇలాంటి వారు రోజుకు రెండు లేదా మూడు కప్పుల బ్లాక్ కాఫీని తాగుతారని బ్యూట్నర్ కనుగొన్నారు. ఏదేమైనా బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది. హెవీ లాట్స్ లేదా షుగర్ కలిపిన కాఫీని తాగితే ఈ ప్రయోజనాన్ని పొందలేరట.
healthy life
మీరు చూసిన మొదటి వ్యక్తికి ఏదైనా మంచి విషయం చెప్పండి
బ్లూ జోన్స్ పరిశోధన ప్రకారం.. ఇది మీరు ఆరోగ్యంగా, ఎక్కువ కాలం బతకడానికి బాగా ఉపయోగపడుతుంది. బ్యూట్నర్ 'మనం కలిసిన మొదటి వ్యక్తికి మంచి విషయం చెప్పండి' అని రాసుకొచ్చారు. హార్వర్డ్ అధ్యయనం.. ప్రవర్తనలు అంటువ్యాధి అని చూపిస్తుంది. కాబట్టి మీరు మీ పొరుగువారికి మంచి విషయాలను చెబితే వారు కూడా మీకు ఇలాగే చెప్పే అవకాశం ఉంది. ఇది ఇతరులతో మీ బంధాన్ని పెంచడంతో పాటుగా మీరు ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతకడానికి దారితీస్తుంది.