Black Tea: బ్లాక్ టీతో అద్భుతమైన 10 రకాల ప్రయోజనాలు.. అవి ఏంటో తెలుసా?
Black Tea: బ్లాక్ టీని కామోల్లియా సినేసిస్ (Chamomile sinusitis) అనే మొక్క ఆకుల పొడితో తయారవుతుంది.

ఈ టీ చిక్కటి ముదురు రంగులో ఉంటుంది కనుక దీనిని బ్లాక్ టీ (Black tea) అని పిలుస్తారు. ఈ టీ లో కేఫిన్ తక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి కాఫీ, ఇతర టీలకు బదులుగా ప్రతిరోజూ బ్లాక్ టీని తీసుకుంటే ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు అంటున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బ్లాక్ టీలో ఉండే టానిన్స్ జీర్ణక్రియకు ఉపయోగపడే రసాయనాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ (Anti-inflammatory) గుణాలు జీర్ణక్రియ వ్యవస్థను (Digestive system) మెరుగుపరిచి జీర్ణక్రియ సమస్యలను దూరం చేస్తాయి. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్స్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే గుణాలు బ్లాక్ టీలో ఉంటాయి.
కనుక రోజూ ఒక కప్పు బ్లాక్ టీని తాగితే బరువు తగ్గడంతో పాటు మధుమేహం, పీసీఓడీ, గుండె జబ్బులు వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఈ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) శరీరంలోని జీవక్రియల (Metabolism) పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే ఇందులో ఉండే టానిన్లు పేగులకు సంబంధించిన సమస్యలను తగ్గించి డయేరియా వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో (Respiratory diseases) బాధపడేవారు ప్రతి రోజూ బ్లాక్ టీ ని తీసుకుంటే మంచిది. బ్లాక్ టీలో ఉండే ఎమైనో యాసిడ్స్ ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గించి రోజంతా హుషారుగా ఉండేందుకు సహాయపడుతాయి. అలాగే ఈ టీని తీసుకుంటే రోగనిరోధక శక్తి (Immunity) పెరుగుతుంది. దీంతో పలు రకాల వైరస్ లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు.
బ్లాక్ టీ లో కేంప్ ఫెరాల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రొమ్ము, ఉదర, పెద్దపేగు, ఊపిరితిత్తుల వంటి పలు రకాల క్యాన్సర్లను (Cancers) అడ్డుకుంటాయి. అలాగే బ్లాక్ టీలో ఫైటోకెమికల్స్ (Phytochemicals) పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను గట్టి పరచి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కనుక ప్రతిరోజూ బ్లాక్ టీని సేవిస్తే ఎముకలు దృడంగా మారుతాయి.
ఇందులో తక్కువ మోతాదులో ఉండే కెఫిన్ మెదడుకు సాఫీగా రక్త సరఫరా అయ్యేలా చేస్తుంది. దీంతో మెదడు పనితీరుతో (Brain function) పాటు నాడీ కణాల వ్యవస్థ (Nervous cell system) కూడా మెరుగుపడుతుంది. పొగతాగే వారిలో వచ్చే పార్కిన్సన్ వ్యాధి నుంచి బ్లాక్ టీ రక్షిస్తుంది. కనుక ప్రతిరోజూ ఈ టీ తాగితే ఈ వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువ.
నోటి దుర్వాసన (Bad breath), దంత సమస్యలతో (Dental problems) బాధపడే వారికి బ్లాక్ టీ చక్కటి పరిష్కారం. కనుక ప్రతిరోజూ ఈ టీని తీసుకుంటే నోటి సమస్యలు తగ్గి నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా శరీరానికి శక్తి లభించి వివిధ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి.