సగ్గుబియ్యంతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా.. ఈ విషయం మీకు తెలుసా?
సగ్గుబియ్యాన్ని సాబుదాన (Saboodana) అని కూడా అంటారు. సగ్గుబియ్యంలో అనేక పోషకాలు ఉన్నాయి. అవి శరీరానికి కావలసిన శక్తిని అందించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు శరీరం నీరసించి శక్తిని కోల్పోతుంది. అలాంటి సమయంలో సగ్గుబియ్యంతో జావ (Java) చేసుకుని తాగితే నీరసించిన శరీరానికి శక్తిని అందించి ఉత్తేజపరుస్తుంది. ఇలా అనేక విధాలుగా శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడగలిగే శక్తి సగ్గుబియ్యాన్ని ఉంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా సగ్గుబియ్యం తీసుకుంటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..

సగ్గుబియ్యం (Stuffed) కార్బోహైడ్రేట్లను (Carbohydrates) అధిక మొత్తంలో, కొవ్వు పదార్థాలను తక్కువ మొత్తంలో కలిగి ఉంటుంది. ఇది ఒంట్లో వేడిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు సగ్గుబియ్యాన్ని డైట్ లో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చిన్న పిల్లల ఆరోగ్య మెరుగుదలకు సగ్గుబియ్యాన్ని ఇవ్వడం మంచిది. సగ్గుబియ్యంలో స్టార్చ్ శాతం ఎక్కువగా ఉంటుంది. సగ్గుబియ్యాన్ని రోగులకు ఎనర్జీ అందించే ప్రోటీన్ గా చెబుతారు. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
బలహీనతను పోగొడుతుంది: సగ్గుబియ్యంలో అనేక ప్రోటీనులు (Proteins) ఉంటాయి. సగ్గుబియ్యం శరీరానికి కావలసిన శక్తిని అధిక మొత్తంలో అందిస్తుంది. మన ఆహారపు జీవనశైలిలో సగ్గుబియ్యాన్ని చేర్చుకోవడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీర బలహీనతతో బాధపడే వారు సగ్గుబియ్యాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. శరీరానికి కావలసిన శక్తిని తక్షణమే అందించి శరీర బలహీనతను పోగొడుతుంది. అందుకే దీన్ని అధిక ఎనర్జీ బూస్టర్ (High Energy Booster) అని కూడా అంటారు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: జీర్ణక్రియను (Digestion) మెరుగు పరచడానికి సగ్గుబియ్యం చక్కగా సహాయపడుతుంది. సగ్గుబియ్యాన్ని పాలలో ఉడికించి అందులో చక్కెర జోడించి తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు అన్ని తగ్గుముఖం పడతాయి. అలాగే సగ్గుబియ్యంలో ఫైబర్ శాతం అధికంగా ఉండడంతో పేగుల్లో పేరుకు పోయిన బలాన్ని తేలిక పరిచి మలబద్ధకం (Constipation) సమస్యను తగ్గిస్తుంది.
అధిక బరువు తగ్గిస్తుంది: బరువు తగ్గాలనుకునేవారు సగ్గుబియ్యాన్ని డైట్ లో తీసుకోవడం మంచిది. ఇందులో కొవ్వు పదార్థం (Fatty substance) తక్కువగా ఉండి ఫైబర్ (Fiber) శాతం అధికంగా ఉంటుంది. ఇది బరువును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. డయాబెటిస్ ను కూడా తగ్గిస్తుంది.
పోషకాల గని: సగ్గుబియ్యంలో క్యాల్షియం, ఐరన్, ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. అందుకే దీన్ని పోషకాల గని అని కూడా అంటారు. ఇందులో అధిక మొత్తంలో ఉండే కాల్షియం (Calcium) ఎముకలను బలపరుస్తుంది. ఐరన్ రక్తపోటును మెరుగుపరచడానికి, అనేమియా (Anemia) సమస్యల నుంచి బయటపడడానికి సహాయపడుతుంది.
సగ్గుబియ్యం వంటలు: సగ్గుబియ్యంలో తక్కువ మొత్తంలో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. సగ్గుబియ్యానికి ఇతర ప్రోటీన్ లను జోడించి తీసుకోవడంతో అధిక న్యూట్రిషన్ (Nutrition) గా పనిచేస్తుంది. సగ్గుబియ్యాన్నికి ఏ ఇతర పదార్థాలను జోడించకుండా నేరుగా తీసుకుంటే పోషకాహార లోపం (Malnutrition) ఏర్పడుతుంది. కనుక ఇతర పదార్థాలను జోడించి తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.