MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Life
  • Gardening
  • Kitchen Tips: ఇంట్లో బల్లులతో ఇబ్బందా? సింపుల్ టిప్స్ మీకోసమే...

Kitchen Tips: ఇంట్లో బల్లులతో ఇబ్బందా? సింపుల్ టిప్స్ మీకోసమే...

Kitchen Tips: ఇళ్లల్లో పెద్ద సమస్య...బల్లులు. అటు ఇటూ తిరుగుతూ ఇబ్బంది పెడతాయి. సడెన్ గా ఒక్కోసారి ఇళ్లల్లో మనుషులపైనా పడిపోతుంటాయి. ఆహారపదార్థాలపైనా పడిపోతాయి. అయితే కొన్ని సులభ మార్పులు, సహజ చిట్కాలు పాటిస్తే ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టొచ్చు

2 Min read
Author : Nandini Arava
Published : Feb 24 2026, 05:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇళ్లల్లో పెద్ద సమస్య...బల్లులు
Image Credit : Getty

ఇళ్లల్లో పెద్ద సమస్య...బల్లులు

చాలా మంది ఇళ్లల్లో పెద్ద సమస్య...బల్లులు. అటు ఇటూ తిరుగుతూ ఇబ్బంది పెడతాయి. హానికరం కాకపోయినా, కిచెన్‌లో లేదా బెడ్‌రూమ్‌లో కనిపిస్తే భయపడతారు. అంతేకాదు...సడెన్ గా ఒక్కోసారి ఇళ్లల్లో మనుషులపైనా పడిపోతుంటాయి. దాంతో భయంతో గట్టిగా అరవడం ఖాయం. కాస్త ఏమరుపాటుగా ఉన్నా.. ఆహారపదార్థాలపై పడిపోతాయి. వాటిని మనం తినలేక బయట పారేస్తుంటాం. అంతేకాదు...వాటి మల మూత్ర విసర్జన ద్వారా ఇంట్లో వాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తాయి.

వేసవి మొదలైంది అంటే… ఇళ్లలో వేధించే సమస్యల్లో బల్లులు ఒకటి. గోడలపై పరుగులు తీస్తూ చికాకు పుట్టిస్తాయి. వేడి పెరిగేకొద్దీ ఆహారం, నీరు, చల్లని ప్రదేశాల కోసం ఇవి ఇళ్లలోకి చొరబడతాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వేసవిలో బల్లులు బెడద
Image Credit : Getty

వేసవిలో బల్లులు బెడద

వేసవిలో బల్లులు ఇళ్లలోకి రావడానికి ప్రధాన కారణం పురుగులు. దోమలు, ఈగలు, చీమలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఇవి ఆశ్రయిస్తాయి. అలాగే చీకటి మూలలు, తడి ప్రదేశాలు, చెదురుమదురు సామాను ఉన్న గదులు వీటికి ఇష్టమైనవి. ఓపెన్ కిటికీలు, తలుపుల గ్యాప్‌ల ద్వారా ఇవి సులభంగా లోపలికి వచ్చేస్తాయి.

అయితే ఆందోళన అవసరం లేదు. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే కెమికల్స్ కాకుండా సహజమైన మార్గాల్లోనే బల్లులను దూరం పెట్టొచ్చు. అదెలా అంటే…

34
బల్లుల నివారణకు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి.
Image Credit : Getty

బల్లుల నివారణకు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి.

మొదటిగా మెయిన్ డోర్స్ మూసేయాలి. గోడలలోని పగుళ్లు, కిటికీల గ్యాప్‌లు సరిచేయాలి. డోర్ స్వీప్స్, మెష్ స్క్రీన్‌లు అమర్చడం వల్ల ఇవి లోపలికి రాకుండా అడ్డుకోవచ్చు.

అన్నింటికన్నా ముందు ఇంటి శుభ్రత అత్యంత ముఖ్యం. పురుగులు లేకపోతే బల్లులు రావు. కాబట్టి ప్రతిరోజూ ఇల్లు ఊడ్చుకోవాలి. చెత్తను నిల్వ చేయకుండా వెంటనే బయటకు పడేయాలి. ఇంట్లో ఉండే ఆహారంపై మూసివేసి ఉంచాలి.

ఇంట్లో ఉండే చెదురుమదురు సామానులు తొలగించాలి. ఫర్నిచర్ వెనుక, స్టోర్ రూమ్ మూలల్లో పేరుకుపోయిన పేపర్లు, బాక్సులు తొలగించాలి.

44
పెప్పర్ మింట్ ఆయిల్, ఉల్లిపాయ, వెల్లుల్లిలో బల్లులకు చెక్
Image Credit : Getty

పెప్పర్ మింట్ ఆయిల్, ఉల్లిపాయ, వెల్లుల్లిలో బల్లులకు చెక్

సహజ నివారణ మార్గాలు కూడా ఉన్నాయి. పెప్పర్‌మింట్ ఆయిల్‌ను నీటిలో కలిపి స్ప్రే చేస్తే దాని వాసనకు బల్లులు ఇంట్లోకి చేరవు. ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలను సింక్ దగ్గర లేదా మూలల్లో ఉంచినా మంచి ఫలితం ఉంటుంది. గుడ్ల తొక్కలను కిచెన్ లేదా బాల్కనీలో ఉంచితే కూడా ఇవి దూరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాఫీ పొడి, టొబాకో మిశ్రమం కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి.

బల్లుల విషయం పెద్ద సమస్యేమీ కాదు. దీని కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. క్రమం తప్పకుండా ఇల్లు క్లీన్ చేసుకోవాలి. సహజ చిట్కాలు పాటించడం ద్వారా వేసవిలో ఈ సమస్యను సులభంగా నియంత్రించవచ్చు. కాబట్టి… గోడపై బల్లులు కనిపించినా భయపడకండి. మీ ఇంట్లోనే చక్కటి సరైన పరిష్కారం ఉంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rainy Season Plants : వర్షాకాలంలో వేగంగా పెరిగే మొక్కలు ఇవే!
Recommended image2
Tulsi Plant: తులసి మొక్క సడెన్ గా ఎండిపోయిందా? కారణం ఇదే
Recommended image3
Spider Plant: బెడ్రూమ్ లో ఈ ఒక్క మొక్క ఉంటే జరిగే మ్యాజిక్ ఇదే..!
Related Stories
Recommended image1
Gardening Tips: ఇంట్లో ఈజీగా పెరిగే అందమైన మొక్కలు ఇవే!
Recommended image2
Gardening: ఇంట్లోనే టీ మొక్క పెంచాలా..? ఇలా చేస్తే చాలు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved