MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Gardening
  • Moringa Farming Tips : ఈ టిప్స్ ఫాలో అయ్యారో.. మీ పెరట్లోని చెట్టుకే గుత్తులుగుత్తుల మునక్కాయలు, సాగులో మీరే తోపు

Moringa Farming Tips : ఈ టిప్స్ ఫాలో అయ్యారో.. మీ పెరట్లోని చెట్టుకే గుత్తులుగుత్తుల మునక్కాయలు, సాగులో మీరే తోపు

మీ పెరట్లో ఒకేఒక్క మునక్కాయ చెట్టు పెంచి ఇంటి అవసరాలకు సరిపడా కాయలు పొందవచ్చు.. మార్కెట్లో అమ్ముకుని డబ్బులు కూడా సంపాదించవచ్చు. ఇలా మునగ చెట్టుకు గుత్తులుగుత్తులుగా కాయలు కాయాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.  

2 Min read
Author : Arun Kumar P
Published : May 26 2026, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మునక్కాయ సాగు చిట్కాలు..
Image Credit : Gemini AI

మునక్కాయ సాగు చిట్కాలు..

Moringa Farming : మాంసాహారులకు చికెన్, మటన్ ఎలాగో శాఖాహారులకు మునక్కాయ అలాగ... అందుకే దీన్ని పేదవాడి మటన్ అంటారు. మనక్కాయ ముక్కల్లో గుజ్జును జుర్రుకుని తింటుంటే మటన్ నల్లిబొక్కను జుర్రినట్లే ఉంటుంది... మసాలా దట్టించి వండే మునక్కాయ కూర, సాంబార్ మటన్ కర్రీకి ఏమాత్రం తీసిపోదు. అంతేకాదు మటన్ లో మాదిరిగానే శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు మునక్కాయలో ఉంటాయి. అందుకే భారత ప్రజలు మరీముఖ్యంగా తెలుగోళ్లు మునక్కాయను ఎక్కువగా తింటుంటారు... కొందరు పెరట్లోనే మునగ చెట్లు వేస్తుంటారు.

అయితే మునగ సాగు చాలా క్లిష్టమైనది... కొన్నిసార్లు ఈ చెట్టుకు పువ్వులు బాగా పూసినా కాయలు కావు. మీ పెరట్లో వేసిన మునగ చెట్టు పరిస్థితి ఇంతేనా..? అయితే కంగారుపడకండి. ఇలాంటప్పుడు కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు దిగుబడి బాగా పెరుగుతుంది. ఎంతలా అంటే ఒక్కచెట్టు నుండి మీ ఇంటి అవసరాలకు సరిపడా మునక్కాయలు తీసుకుని మిగతావి అమ్ముకుని డబ్బులు కూడా సంపాదించొచ్చు. ఇలా మునగ చెట్టుకు కాయలు బాగా కాయాలంటే ఏం చేయాలో చూద్దాం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
మునక్కాయ దిగుబడి పెరగాలంటే ఏం చేయాలి?
Image Credit : Getty

మునక్కాయ దిగుబడి పెరగాలంటే ఏం చేయాలి?

ఇంటి పెరట్లో ఉన్న మునగ చెట్టు నుంచి ఎక్కువ కాయలు పొందాలన్నా, పూత రాలిపోకుండా ఆపాలన్నా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిసార్లు అతి జాగ్రత్తలు కూడా దిగుబడి తగ్గడానికి కారణమవుతాయి. ఇలా మునగ చెట్టు పూతకు వచ్చినప్పుడు ఎక్కువగా నీళ్లు పెడితే పూలు రాలిపోతాయి. అందుకే పూత దశలో నీళ్లు తగ్గించాలి. కానీ పిందెలు పడ్డాక మాత్రం చెట్టుకు సరిపడా నీళ్లు అందించాలి.

ఏడాదికి రెండుసార్లు (వానాకాలానికి ముందు, తర్వాత) మునగ చెట్టు మొదలుకు కొంచెం దూరంగా పాదులు చేయాలి. పశువుల ఎరువు, కంపోస్ట్ లేదా కోళ్ల ఎరువు వేసి మట్టితో కప్పితే, చెట్టు పెరుగుదలకు అవసరమైన నైట్రోజన్ అందుతుంది.

Related Articles

Related image1
Drumstick Benefits: ఇది నిజంగా మిరాకిల్ ట్రీ.. మునగతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
Related image2
Moringa Water: రోజూ ఉదయాన్నే మునగాకు నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
35
మునక్కాయ చెట్టుకు బూడిదవేస్తే ఇంత లాభమా?
Image Credit : Gemini AI

మునక్కాయ చెట్టుకు బూడిదవేస్తే ఇంత లాభమా?

మునగ చెట్టు కాయలు కాయడానికి బూడిద చాలా బాగా పనిచేస్తుంది. చెట్టు మొదట్లో ఎండుటాకులతో కలిపి గానీ, లేదా నేరుగా గానీ బూడిద చల్లితే మట్టిలో పొటాషియం పెరిగి, ఎక్కువ కాయలు కాస్తాయి.

మునక్కాయలకు కాయతొలిచే ఈగల (ఫ్రూట్ ఫ్లైస్) బెడద ఎక్కువ. కాయలు చిన్నగా ఉన్నప్పుడే నెట్ బ్యాగులు లేదా రంధ్రాలున్న ప్లాస్టిక్ కవర్లతో కప్పేస్తే, ఈగలు గుడ్లు పెట్టకుండా ఆపొచ్చు.

మునగ చెట్టును మరీ ఎత్తుగా పెరగనివ్వొద్దు. కాయల కోత తర్వాత ప్రధాన కొమ్మల చివర్లను కత్తిరిస్తే (ప్రూనింగ్), కొత్త కొమ్మలు వచ్చి వాటికి ఇంకా ఎక్కువ పూత వస్తుంది.

45
మునక్కాయ చెట్టుకు మజ్జిగ వేయండి..
Image Credit : Getty

మునక్కాయ చెట్టుకు మజ్జిగ వేయండి..

మునగచెట్టు పూత రాలకుండా ఆపడానికి పుల్లటి మజ్జిగ లేదా గంజిని బాగా నీళ్లలో కలిపి ఆకులపై, పూలపై స్ప్రే చేయడం ఒక మంచి చిట్కా. దీనివల్ల మునక్కాయల దిగుబడి పెరుగుతుంది.

చెట్టుకు పూత బాగా వస్తున్నా, కాయలుగా మారకుండా రాలిపోతుంటే అది బోరాన్ లోపం వల్ల కావచ్చు. వ్యవసాయ అధికారి సలహాతో సరైన బోరాన్ మిశ్రమాన్ని నీళ్లలో కలిపి స్ప్రే చేస్తే ఈ సమస్య తీరుతుంది.

వేరుకుళ్లు, ఆకుమచ్చ తెగుళ్లను నివారించడానికి, చెట్టు రోగనిరోధక శక్తిని పెంచడానికి 20 గ్రాముల సూడోమోనాస్‌ను ఒక లీటర్ నీటిలో కలిపి చెట్టు మొదట్లో పోయాలి.

55
మునక్కాయ చెట్టును సూర్యరశ్మిలో పెంచండి
Image Credit : pixabay

మునక్కాయ చెట్టును సూర్యరశ్మిలో పెంచండి

మునగ చెట్టుకు సూర్యరశ్మి బాగా తగిలే చోటును ఎంచుకోవాలి. నీడ ఉన్న ప్రదేశాల్లో పెంచితే పూత తగ్గి, కాయలు సరిగా కాయవు.

వేరుశనగ చెక్క, వేప పిండిని పులియబెట్టి తయారుచేసిన సేంద్రియ ద్రావణాన్ని (స్లర్రీ) నెలకు ఒకసారి నీళ్లలో కలిపి మొదట్లో పోస్తే, మునగ చెట్టు ఏపుగా పెరిగి ఏడాది పొడవునా కాయలు కాస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యవసాయం (Vyavasayam)
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Money Plant: ఎండాకాలంలో కూడా మనీ ప్లాంట్ బాగా పెరగాలా? ఇలా చేస్తే చాలు
Recommended image2
Snake Plant: ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచితే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Gardening: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ప్రశాంతంగా నిద్రపోతారు
Related Stories
Recommended image1
Drumstick Benefits: ఇది నిజంగా మిరాకిల్ ట్రీ.. మునగతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
Recommended image2
Moringa Water: రోజూ ఉదయాన్నే మునగాకు నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved