మునగాకు నీటిలో ఎన్నో పోషకాలున్నాయి. వీటిని తాగడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
విటమిన్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలతో నిండిన మునగాకు నీరు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
మునగాకు విటమిన్ సి కి గొప్ప వనరు. మునగాకు నీటిని రెగ్యులర్ గా తాగడం వల్ల జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
మునగాకు నీరు తాగడం వల్ల జీవక్రియ పెరిగి ఆకలి తగ్గుతుంది. దానివల్ల బరువు తగ్గే అవకాశముంది.
మలబద్ధకం, విరేచనాలు, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను తగ్గించడానికి మునగాకు నీళ్లు సహాయపడతాయి.
మునగాకు నీటిలో ఐసోథియోసైనేట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని స్థిరీకరించడంలో సహాయపడతాయి.
మునగాకులో పాలీఫెనాల్, టానిన్లు, సపోనిన్లు ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.
Chia Seeds: చియా సీడ్స్ ని ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా?
ఇంట్లో ఈ వస్తువులను ఉంచితే ఏమౌతుందో తెలుసా?
నెయ్యిని రోజూ తింటే ఆరోగ్యానికి ఇంత మంచిదా
వీళ్లకు రాగి బాటిల్ నీళ్లు మంచివి కావు.. అస్సలు తాగకూడదు