Drumstick Benefits: ఇది నిజంగా మిరాకిల్ ట్రీ.. మునగతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
Drumstick Benefits: మునగ చెట్టును ‘మిరాకిల్ ట్రీ’ అంటారంటే.. ఈ చెట్టులో ఎన్ని పోషక విలువలు దాగి ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మీకు సంపూర్ణ ఆరోగ్యం కావాలన్నా, సీజనల్ వ్యాధుల నుంచి బయటపడాలన్నా ప్రతి రోజూ మునగ కాయలు మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. మునగకాయల వల్ల ఇంకా ఏమేం లాభాలుంటాయో ఇప్పుడు చూద్దాం.

మునగకాయ చెట్టును 'మిరాకిల్ ట్రీ' (Miracle Tree) అని కూడా అంటారు. ఈ చెట్టులో కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మునగకాయని (Drumstick) మీరు కూరగా, సాంబారు చేసి లేదా మీకు కావాల్సిన రీతిలో ప్రతి రోజు వండుకుని తినడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండటానికి మునగ చాలా సహాయపడుతుంది.
శరీరంలోని విషాన్ని బయటకు పంపిస్తుంది
మునగకాయలు సహజ డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తాయి. ఇవి శరీరం విషాన్ని బయటకు పంపడానికి సహాయపడతాయి. కాలేయ పనితీరును మెరుగు పరుస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇవన్నీ ఆరోగ్యకరమైన రోగనిరోధక ప్రతిస్పందనకు సహాయపడతాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరం బలంగా తయారవుతుంది.
ఇది కూడా చదవండి మెత్తటి కేరళ అప్పాలు ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా!
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
మునగకాయ విటమిన్ సి, విటమిన్ ఎ, ఇనుము, జింక్ వంటి పోషకాలతో నిండి ఉంది. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. విటమిన్ సి ఇన్ఫెక్షన్లతో పోరాడే తెల్ల రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. విటమిన్ ఎ వైరస్‌లు, బ్యాక్టీరియాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.
పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
మునగకాయ జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా పేగులు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మునగకాయలో ఉండే ఫైబర్ కడుపులో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది
మునగకాయల్లో బ్యాక్టీరియా, ఫంగస్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని హానికర సూక్ష్మజీవుల నుంచి కాపాడుతుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే వాపు, నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. జలుబు, జ్వరం, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలకు కూడా మందుగా మునగ కాయలు పనిచేస్తాయి.
ఇది కూడా చదవండి కరకరలాడే క్రిస్పీ కొబ్బరి వడ.. సింపుల్ గా ఇలా చేసేయండి
మునగకాయలను ఎలా తినాలి?
మునగకాయలతో ఆరోగ్య ప్రయోజనం పొందాలంటే వాటిని సూప్ చేసుకోవచ్చు. కూరగా చేసుకొని తినొచ్చు. లేదా సాంబార్ తయారీలో వేసుకోవచ్చు. ఎండిన మునగకాయ ఆకులతో చేసిన మునగ పొడి, సలాడ్‌లపై చల్లుకోవడానికి చాలా బాగుంటుంది. ప్రతి రోజు మీ భోజనంలో మునగకాయను తినడం వల్ల రోగనిరోధక శక్తిప పెరుగుతుంది. ఫలితంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు.