Gardening: ఆకు కూరలు కొనాల్సిన అవసరం లేదు.. బాల్కనీలో ఈజీగా పెంచేయండి..!
Gardening: మీ బాల్కనీలో కొంచెం ఎక్కువ స్థలం ఉంటే చాలు. మార్కెట్ లో కొనాల్సిన అవసరం లేకుండా.. మీరు ఇంట్లోనే సులభంగా ఆకుకూరలు పెంచేయచ్చు. కుండీల్లోనే ఈజీగా పెరిగే ఆకుకూరలు ఏంటో చూద్దాం..

ఆకు కూరలు..
వర్షాకాలంలో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోతాయి. ఇక ఆకు కూరలు అయితే.. తాజాగా దొరకడమే కష్టం. వర్షానికి ఆకు కూరలు తడిచిపోతాయి. అంతేకాదు, పురుగులు కూడా వస్తూ ఉంటాయి. అయితే.. ఇంట్లో మీ చిన్న బాల్కనీలో లేదా ఇంటి మీద టెర్రస్ ఉంటే, చాలా సులభంగా ఆకుకూరలను పెంచుకోవచ్చు. పెద్దగా ఖర్చు లేకుండా, ఎలాంటి కెమికల్స్ లేకుండా సులభంగా పెంచుకోవచ్చు...
1.కొత్తిమీర..
దాదాపు అందరూ కొత్తిమీర మార్కెట్ లోనే కొంటూ ఉంటారు. కానీ, కొత్తిమీరను మనం చాలా ఈజీగా పెంచొచ్చు. మన దగ్గర దనియాలు, కొత్తిమీర కాడలు.. రెండింట్లో ఏది ఉన్నా చిన్న కుండీలో కూడా కొత్తిమీర పెరుగుతుంది.
మార్కెట్ లో తెచ్చిన కొత్తిమీర కాడలు మీ దగ్గర ఉంటే..వాటికి వేర్లు ఉంటే.. వాటిని నీరు ఉన్న సీసాలో పెడితే సరిపోతుంది. రెండు, మూడు రోజుల్లోనే ఆకులు రావడం మొదలౌతాయి.
లేదంటే, ధనియాలతో కూడా పెంచొచ్చు. బాగా ఎండిన ధనియాలను చేతితో నలిపి.. మట్టిలో చల్లాలి. రెగ్యులర్ గా నీటిని చల్లాలి. మరీ ఎక్కువగా పోయకూడదు. కేవలం వారం రోజుల్లోనే మొలకలు రావడం మొదలౌతాయి. రోజుకి 3 నుంచి 4 గంటల సూర్యరశ్మి తగిలేలా చూసుకుంటే సరిపోతుంది.30 నుంచి 40 రోజుల్లో కొత్తిమీర ఏపుగా పెరుగుతుంది. ఆకులు తుంచి మనం వంటలో వేసుకోవచ్చు.
2.పుదీనా..
పుదీనా కూడా వర్షాకాలంలో చాలా ఈజీగా పెరుగుతుంది. మార్కెట్ లో కొన్న పుదీనా కాడలను నీటిలో పెట్టాలి. వేర్లు వచ్చేంత వరకు అలానే ఉంచాలి. వేర్లు వచ్చిన తర్వాత.. వాటిని కుండీలో నాటితే సరిపోతుంది. అయితే.. మట్టిలో ఎప్పుడూ తేమగా ఉంచితే సరిపోతుంది. కేవలం 20 రోజుల్లోనే ఆకులు రావడం మొదలౌతాయి. చాలా ఈజీగా పుదీనా పెరుగుతుంది.
పాలకూర..
వర్షాకాలంలో చాలా ఈజీగా పెరిగే ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. పాల కూర గింజలను నేరుగా కుండీల్లో వేయాలి. మంచి మట్టి వాడితే.. పాలకూర చాలా ఈజీగా పెరుగుతుంది. నెల రోజుల్లో పాలకూర చేతికి వస్తుంది.
మెంతి కూర...
చాలా తక్కుమ సమయంలో కోతకు వచ్చే ఆకు కూర మెంతికూర. దీని కోసం.. మెంతులను ఒక రాత్రంతా నీటిలో నానపెట్టి.. మరుసటి రోజు మట్టిలో చల్లితే సరిపోతుంది. వారం రోజుల్లో మొలకలు వస్తాయి. మరో వారానికి ఆకులు వచ్చేస్తాయి.
