Kanthari Chilli: గుంటూరు మిర్చిని మించిన ఘాటు..ఇంట్లోనే పెంచేయొచ్చు
gardening Jul 27 2026
Author: Nandini Arava Image Credits:Getty
Telugu
సూర్యరశ్మి అవసరం
కాంతారి మిరప మొక్కలు పెరగాలంటే రోజుకు కనీసం 5 నుంచి 6 గంటల పాటు నేరుగా ఎండ తగిలేలా చూసుకోవాలి. అప్పుడే మొక్క బాగా పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
కుండీ లేదా గ్రోబ్యాగ్‌లో
ఈ మొక్కను నేల మీదే కాదు, పెద్ద సైజు కుండీలో లేదా గ్రోబ్యాగ్‌లో కూడా సులభంగా పెంచవచ్చు. మట్టి, కోకోపీట్, పశువుల ఎరువును సరైన నిష్పత్తిలో కలిపి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి.
Image credits: Getty
Telugu
పశువుల ఎరువు
మొక్కను నాటేటప్పుడు, అడుగున ఎండిన పశువుల ఎరువు, కొద్దిగా వేపపిండిని బేసల్ ఫెర్టిలైజర్‌గా వేయాలి. కుండీలో నీరు నిలిచిపోకుండా, బయటకు పోయేలా చూసుకోవాలి.
Image credits: Getty
Telugu
కొనలు తుంచేయాలి
మొక్క పెరుగుతున్నప్పుడు పై కొనలు తుంచేస్తే తర్వాత కొమ్మలతో గుబురుగా పెరుగుతుంది. కొమ్మలు ఎక్కువగా ఉంటే పూలు, కాయలు కూడా ఎక్కువగా వస్తాయి. దిగుబడి పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
వేపనూనె-వెల్లుల్లి మిశ్రమం
వారానికి ఒకసారి వేపనూనె-వెల్లుల్లి మిశ్రమాన్ని లేదా పుల్లటి మజ్జిగను పిచికారీ చేస్తే ఆకుముడత తెగులు రాకుండా నివారించవచ్చు.
Image credits: Getty
Telugu
గంజి నీళ్లు
వంటగదిలోని సేంద్రియ వ్యర్థాలు, గంజి నీళ్లను పులియబెట్టి మొక్కకు పోస్తే దాని ఆరోగ్యం మెరుగుపడుతుంది. మొక్క బలంగా పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
నీటిపారుదల, సేంద్రియ ఎరువు
సరైన నీటిపారుదల, సేంద్రియ ఎరువులు అందిస్తే చాలు. ఏడాది పొడవునా తాజా మిరపకాయలను మీ పెరటి నుంచే కోసుకోవచ్చు. ఈ మొక్కలు దాదాపు 4 ఏళ్ల వరకు కాపునిస్తాయి.