MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Gardening
  • Mint Plant: పుదీనా 10 రోజుల్లో గుబురుగా పెరగాలా? ఇదొక్కటి చేస్తే చాలు..!

Mint Plant: పుదీనా 10 రోజుల్లో గుబురుగా పెరగాలా? ఇదొక్కటి చేస్తే చాలు..!

Mint Plant: పుదీనా ఆకు వంటకు రుచి పెంచడమే కాకుండా, చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగింది. ఈ పుదీనాని ప్రతిసారీ మార్కెట్ లో కొనే బదులు మన ఇంట్లో కుండీలోనే ఈజీగా పెంచేయచ్చు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 03 2026, 02:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
MInt Plant
Image Credit : Asianet News

MInt Plant

Mint Plant: చాలా మంది తాము రోజు వాడే వంటలో పుదీనాను బాగా వాడుతూ ఉంటారు. బిర్యానీ దగ్గర నుంచి పుదీనా చట్నీ వరకు అన్నింటికీ ఈ పుదీనా కావాల్సిందే. దీని కోసం రెగ్యులర్ గా మార్కెట్ లో పుదీనా కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ.. ప్రతిసారీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా... అతి తక్కువ శ్రమ, ఎలాంటి ఖర్చు లేకుండా.. ఈ పుదీనాని సింపుల్ గా చాలా ఈజీగా పెంచేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
  ముందుగా మట్టిని సిద్ధం చేసుకోవాలి...
Image Credit : gemini AI

ముందుగా మట్టిని సిద్ధం చేసుకోవాలి...

పుదీనాని పెంచడానికి సరైన మట్టిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. బంకమట్టి నేలలో పుదీనా సరిగా పెరగదు. పుదీనా నాటడానికి 20 శాతం కోకోపిట్, 15 శాతం వర్మీకంపోస్ట్ లేదా ఆవు పేడను కలిపి, మిగిలిన దానిని సాధారణ మట్టితో కలపాలి. ఈ మట్టి పుదీనా పెరగడానికి చాలా అనువుగా ఉంటుంది.

మంచి కుండీ ఎంచుకోవడం...

పుదీనాకు లోతైన కుండీ అవసరం లేదు. వెడల్పుగా ఉన్న కుండీ ఎంచుకుంటే సరిపోతుంది. అయితే, కుండీ అడుగున కచ్చితంగా రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఎక్కువగా నీరు పోస్తే.. అవి బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది.

33
పుదీనా కాడలు ఎలా నాటాలి?
Image Credit : Getty

పుదీనా కాడలు ఎలా నాటాలి?

పుదీనా కొమ్మల నుండి ఈజీగా పెరుగుతుంది. అయితే... ఎంచుకునే కొమ్మలకు రెండు మొగ్గలు ఉండాలి. కింది ఆకులు తీసేసి, లోతు తక్కువగా ఉండే కుండీలో గుచ్చితే సరిపోతుంది. ఇక.. నాటిన కొమ్మలను గట్టిగా నొక్కకూడదు. నాటిన తర్వాత, కొమ్మపై నేరుగా సూర్యరశ్మి పడకుండా చూసుకోవాలి. ఎండ చాలా తక్కువగా వచ్చే ప్లేసులో ఈ కుండీని ఉంచడం ఉత్తమం.

పుదీనా గుబురుగా పెరగడానికి ఈ చిట్కా చాలు...

అయితే.. పుదీనా గుబురుగా పెరిగేందుకు ఒక చిన్న చిట్కా వాడితే చాలు. దాని కోసం ఇంట్లో బంగాళదుంప ఉంటే సరిపోతుంది. బంగాళ దుంప ఎరువు పుదీనా పెరుగుదలను రెట్టింపు చేస్తుంది. దీని కోసం , ఒక బంగాళదుంపను మెత్తగా నూరి, ఒక లీటర్ నీటిలో కలిపి, ఈ లిక్విడ్ ని మొక్కలపై స్ప్రే చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల.. చాలా తక్కువ సమయంలో పుదీనా గుబురుగా పెరుగుతుంది.

కొమ్మలను నాటిన తర్వాత, ఎక్కువ నీరు పోయకుండా, తేలికగా నీరు పెట్టండి. 7-8 రోజుల తర్వాత, మొక్కను నేరుగా సూర్యరశ్మి తగిలే చోట ఉంచవచ్చు. మొక్కను మరింత గుబురుగా పెంచడానికి, దాని పైభాగాన్ని ఎప్పటికప్పుడు కొద్దిగా కత్తిరించండి లేదా తుంచండి.

వేసవిలో పుదీనా ఎందుకు మంచిది?

పుదీనా శరీరాన్ని చల్లబరచడానికి , వేడి నుండి రక్షించడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, ఎసిడిటీని తగ్గిస్తుంది. పుదీనాను చట్నీలు, షర్బత్, రైతా , వేసవిలో సేదతీర్చే అనేక ఇతర పానీయాలలో ఉపయోగిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
తోటపని
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rainy Season Plants : వర్షాకాలంలో వేగంగా పెరిగే మొక్కలు ఇవే!
Recommended image2
Tulsi Plant: తులసి మొక్క సడెన్ గా ఎండిపోయిందా? కారణం ఇదే
Recommended image3
Spider Plant: బెడ్రూమ్ లో ఈ ఒక్క మొక్క ఉంటే జరిగే మ్యాజిక్ ఇదే..!
Related Stories
Recommended image1
Okra Tips: ఈ పొడి చల్లితే...బెండకాయ జిగురు రాదు..!
Recommended image2
Ginger: ఇంట్లో కుండీలోనే అల్లం పెంచొచ్చు, ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved