Telugu

ఈ ట్రిక్స్ తో కొత్తిమీరను కుండీలో ఈజీగా పెంచవచ్చు!

Telugu

క్వాలిటీ ధనియాలు

కొత్తిమీర పెంచాలనుకుంటే ముందుగా మంచి క్వాలిటీ ధనియాలు కొనాలి. నాటే ముందు, ధనియాలను రెండుగా విడగొట్టి రాత్రంతా నీటిలో నానబెట్టాలి.

Image credits: Getty
Telugu

మట్టి తయారీ

నీరు నిల్వని సారవంతమైన మట్టి కొత్తిమీర పెంపకానికి చాలా మంచిది. మట్టిలో కొద్దిగా పశువుల ఎరువు కలపాలి. విత్తనాలను మరీ లోతుగా కాకుండా, పైపైన చల్లి, పలుచగా మట్టి కప్పాలి.

Image credits: Getty
Telugu

నీళ్లు ఎలా పోయాలంటే?

విత్తనాలు చల్లిన వెంటనే ఎక్కువ నీళ్లు పోయకూడదు. స్ప్రేయర్‌తో మట్టి తడిసేలా నీళ్లు చల్లితే సరిపోతుంది. మట్టి ఎప్పుడూ తేమగా ఉండాలి.

Image credits: Getty
Telugu

7 - 15 రోజులు

కొత్తిమీర మొలకెత్తడానికి సాధారణంగా 7 నుంచి 15 రోజులు పడుతుంది.

Image credits: Getty
Telugu

4- 5 గంటలు

రోజూ కనీసం 4 నుంచి 5 గంటల పాటు నేరుగా ఎండ తగిలే చోట కుండీని పెట్టాలి. సరైన ఎండ తగిలితేనే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

వేర్లు కుళ్లిపోకుండా..

మొక్క మొదట్లో నీరు నిలిచిపోతే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. రెండు వారాలకు ఒకసారి, సేంద్రియ ఎరువులను నీటిలో కలిపి వేస్తే మొక్క పెరుగుదల బాగుంటుంది.

Image credits: Getty
Telugu

చివర్లు తుంచేయాలి

మొక్కలు 3-4 అంగుళాల ఎత్తు పెరిగాక, చివర్లు తుంచేయాలి. ఇలా చేస్తే కొత్త కొమ్మలు ఎక్కువగా వస్తాయి. ఆకులపై నల్ల మచ్చలు లేదా పురుగులు కనిపిస్తే, వేపనూనె మిశ్రమాన్ని స్ప్రే చేయాలి.

Image credits: Getty
Telugu

30-40 రోజుల్లో..

విత్తనాలు నాటిన 30-40 రోజుల్లో ఆకులను కోసుకోవచ్చు. మొక్కను వేళ్లతో సహా పీకేయకుండా, అవసరమైన ఆకులను మాత్రమే కత్తిరించుకోవాలి.

Image credits: Getty
Telugu

పూత వస్తే ఏం చేయాలి?

మొక్కకు పూత రావడం మొదలైతే, ఆకుల రుచి తగ్గిపోతుంది. కాబట్టి కనిపించిన వెంటనే వాటిని తుంచేయాలి. అప్పుడే ఆకులు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

Image credits: Getty

Balcony Plants: బాల్కనీ కోసం బెస్ట్ పూల మొక్కలు

Garlic Farming: ఇంట్లోనే వెల్లుల్లి ఇలా సింపుల్‌గా పెంచేయండి

Money Plant: ఇదొక్క పొడి వేస్తే మనీ ప్లాంట్ బాగా పెరుగుతుంది..!

Garlic: ఈ సింపుల్ టిప్స్ తో వెల్లుల్లిని ఇంట్లోనే ఈజీగా పెంచవచ్చు!