ఈ ట్రిక్స్ తో కరివేపాకు మొక్కను కుండీలో ఈజీగా పెంచవచ్చు!
gardening Mar 02 2026
Author: Kavitha G Image Credits:instagram
Telugu
కుండీ ఎంపిక
కరివేపాకు మొక్క పెద్దగా పెరుగుతుంది. కాబట్టి 12-15 అంగుళాల లోతు, వెడల్పు ఉన్న కుండీని ఎంచుకోవాలి. అదనపు నీరు పోవడానికి కుండీ కింద రంధ్రం ఉండాలి.
Image credits: instagram
Telugu
మట్టి మిశ్రమం
సాధారణ ఎర్రమట్టిలో సేంద్రియ ఎరువు కలపాలి. అందులో 20% ఇసుక లేదా కొబ్బరి పీచు కలిపితే.. కుండీలో నీరు నిలిచిపోకుండా ఉంటుంది.
Image credits: instagram
Telugu
మొక్క లేదా విత్తనాలు నాటడం
నర్సరీ నుంచి మంచి మొక్కను తెచ్చి నాటడం సులభం. విత్తనాలతో పెంచాలనుకుంటే, బాగా నల్లగా మారిన కరివేపాకు విత్తనాలను ఎంచుకోవాలి.
Image credits: instagram
Telugu
సూర్యరశ్మి
కరివేపాకు మొక్కకు రోజుకు కనీసం 6 నుంచి 7 గంటల ఎండ అవసరం. కాబట్టి ఎండ బాగా తగిలే ప్రదేశంలోనే కుండీని పెట్టాలి.
Image credits: Getty
Telugu
నీరు, ఎరువు
కుండీలో పైమట్టి పొడిగా మారినప్పుడు మాత్రమే నీళ్లు పోయాలి. నీళ్లు ఎక్కువైతే వేర్లు కుళ్లిపోతాయి. నెలకు ఒకసారి పశువుల ఎరువు వేస్తే మొక్క బాగా పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
పుల్లటి మజ్జిగ
పుల్లటి మజ్జిగను నీటిలో కలిపి, వారానికి ఒకసారి మొక్కకు పోసినా మంచిగా పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
ట్రిమ్మింగ్
మొక్క కొంచెం ఎత్తు పెరిగాక, పైభాగంలో ఉండే చిగుర్లను కత్తిరించాలి. అప్పుడు మొక్క ఒకే కొమ్మలా కాకుండా, పక్కనుంచి కొత్త కొమ్మలు వచ్చి గుబురుగా పెరుగుతుంది.
Image credits: instagram
Telugu
పురుగుల నివారణ
కరివేపాకు ఆకులపై తెల్లటి మచ్చలు లేదా నల్లటి పురుగులు కనిపిస్తే, వారానికి ఒకసారి వేప నూనెను నీటిలో కలిపి స్ప్రే చేయాలి.
Image credits: Our own
Telugu
ఈ నీళ్లు పోస్తే మేలు
బియ్యం కడిగిన నీళ్లు లేదా పప్పులు కడిగిన నీళ్లను మొక్కకు పోయడం వల్ల కరివేపాకు మొక్క త్వరగా చిగురిస్తుంది.